
దత్తత గ్రామాల్లో కాళోజీ వర్సిటీ సేవలు
ఏటూరు నాగారం : వరంగల్ జిల్లాలో తాను దత్తత తీసుకున్న గ్రామాల్లో కాళోజీ ఆరోగ్య వర్సిటీ సేవలను ప్రారంభించింది. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న గొత్తికోయ గూడేలు లింగాపురం, రాయిబందం, చిన్మలమర్రిలో 600 కుటుంబాలకు ఆదివారం వస్త్రాలు పంపిణీ చేశారు.
కాళోజీ వర్సిటీ వీసీ బి.కరుణాకర్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... రానున్న రెండు మూడేళ్లలో ఈ గూడేలలో కనీస అవసరాలకు ఇబ్బంది రాకుండా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధబోయిన నాగార్జున, ఎంపీపీ మహీరున్నీసా తదితరులు పాల్గొన్నారు.