కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదని, ఆప్షన్ల విషయంలో తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయాలు...
కమలనాథన్ కమిటీకి టీసీటీజేఏసీ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదని, ఆప్షన్ల విషయంలో తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని తెలంగాణ వాణి జ్య పన్నుల శాఖ జాయింట్ యాక్షన్ కమిటీ (టీసీటీజేఏసీ) ఆరోపించింది. తెలంగాణకు చెందిన అధికారులను తెలంగాణకే కేటాయించాలని శుక్రవారం కమలనాథన్ కమిటీని టీసీటీజేఏసీ కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా టీసీటీజేఏసీ చైర్మన్ వివేక్, టీసీటీజీఓఏ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏపీలో ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని అక్కడి వారితో భర్తీ చేయకుండా జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి వారిని, ఇతర ఉద్యోగులను చివరికి డ్రైవర్లను కూడా తెలంగాణకు కేటాయిస్తున్నారన్నారు. కమిటీ స్పందించి ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.