ఆడపిల్లలు ఆడపులులతో సమానం అనే విషయాన్ని లోకానికి చాటడానికి భారీ బహిరంగ కరాటే ప్రదర్శన ఏర్పాటు చేయడానికి బాలల హక్కులసంఘం ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 24న బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు బాలల హక్కుల సంఘం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో వేయి మంది బాలికలతో కరాటే ప్రదర్శన నిర్వహించనున్నట్లు బాలల హక్కుల సంఘం పేర్కొంది. ఈ కరాటే ప్రదర్శనకు పబ్లిక్ గార్డెన్స్ వేదిక కానుంది. ఆసక్తి ఉన్న పదమూడేళ్ల లోపు బాలికలు హాజరుకావచ్చని, ఎలాంటి ప్రవేశ రుసుం లేదని, ఇందులో పాల్గొన్న బాలికలకు సర్టిఫికెట్లు కూడా అందజేస్తామని బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్ అనురాధారావు తెలిపారు.
ఈ నెల 24న బహిరంగ కరాటే ప్రదర్శన
Published Wed, Jan 21 2015 7:34 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM
Advertisement
Advertisement