child rights comission
-
NCPCR: మదర్సాల్లో బాలల హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ: మదర్సాల్లో విద్యార్థులకు సరైన విద్య బోధించడం లేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఆందోళన వ్యక్తం చేసింది. చాలావరకు మదర్సాలు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, అక్కడి పాఠ్యపుస్తకాల్లో అభ్యంతకర అంశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో తాజాగా సమగ్ర అఫిడవిట్ సమరి్పంచింది. నాణ్యమైన, సమగ్రమైన విద్య పొందడం బాలల ప్రాథమిక హక్కు కాగా, ఆ హక్కు మదర్సాల్లో ఉల్లంఘనకు గురవుతోందని ఆక్షేపించింది. విద్యాహక్కు చట్టం–2009 సైతం ఉల్లంఘనకు గురవుతున్నట్లు తెలియజేసింది. మదర్సాల్లో తగిన విద్యా బోధన జరగకపోగా, మరోవైపు ఆరోగ్యకరమైన వాతావరణం, జీవితంలో పైకి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడం లేదని అఫిడవిట్లో స్పష్టంచేసింది. బిహార్, మధ్యప్రదేశ్, పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ముస్లిమేతరులను సైతం చేర్చుకొని, ఇస్లామిక్ మత విద్య బోధిస్తున్నారని తప్పుపట్టింది. ఇలా చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 28(3)కు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. ‘‘మదర్సాల్లో బోధిస్తున్న విద్య పిల్లలకు పూర్తిగా ఉపయోగపడేది కాదు. అక్కడ సరైన పాఠ్యప్రణాళిక లేదు. విద్యాహక్క చట్టం సెక్షన్ 29లో పేర్కొన్న మూల్యాంకన విధానాలు అమలు కావడం లేదు. అర్హత లేదని ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. నిధుల విషయంలోనూ పారదర్శకత కనిపించడం లేదు. క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. విద్యాహక్కు చట్టం నిర్దేశించిన ప్రమాణాలను లెక్కచేయకుండా చాలావరకు మదర్సాలు సొంతంగానే ఉపాధ్యాయులను నియమించుకుంటున్నాయి. వారికి తగిన విద్యార్హతలే ఉండడం లేదు. మదర్సాల్లో సంప్రదాయ విధానాల్లో ఖురాన్‌తోపాటు ఇతర మత గ్రంథాలు బోధిస్తున్నారు. ఇదంతా అసంఘటితమైన, అసంబద్ధమైన విద్యా వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. పాఠ్యాంశాలు అభ్యంతకరంగా ఉంటున్నాయి. అత్యున్నత మతం ఇస్లాం మాత్రమే అని పిల్లల మెదళ్లలోకి ఎక్కిస్తున్నారు’’ అని పేర్కొంది. -
కన్నీటి వీడ్కోలు
నాగోలు: ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో టీఎన్ఆర్ వైష్ణవి శిఖర అపార్ట్మెంట్స్ 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు విద్యార్థినుల అంత్యక్రియలు శుక్రవారం పూర్తయ్యాయి. వైష్ణవి శిఖర అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న భార్గవిపటేల్ చిత్రాలేఅవుట్‌లోని మంజీరా హైట్స్ ఫేజ్–1కు చెందిన కాలె సావని సాగర్‌రింగురోడ్డు సమీపంలోని అక్షర టెక్నో స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. గురువారం రాత్రి వీరు ఆత్మహత్యకు పాల్పడగా మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శుక్రవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులకు అందజేశారు. భార్గవిపటేల్ అంత్యక్రియలు వీవీనగర్ స్మశానవాటికలో నిర్వహించగా, సావని అంత్యక్రియలు అంబర్‌పేటలోని స్మశాన వాటికలో జరిగాయి. కాగా సావని మృతి చెందిన గంటలోపే ఆమె ఫేస్బుక్ ఐడీ నుంచి ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని తొలగించడం పట్ల ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేపట్టారు. ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి: బాలల హక్కుల సంఘం విద్యార్థినుల ఆత్మహత్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు అన్ని సమకూర్చితే సరిపోదని వారితో కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. విద్యాసంస్థలు పిల్లలను మార్కులు, ర్యాంకుల కోసం వేధించకుండా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యాసంస్థలో మానసిక శాస్త్ర నిపుణులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
ఈ నెల 24న బహిరంగ కరాటే ప్రదర్శన
ఆడపిల్లలు ఆడపులులతో సమానం అనే విషయాన్ని లోకానికి చాటడానికి భారీ బహిరంగ కరాటే ప్రదర్శన ఏర్పాటు చేయడానికి బాలల హక్కులసంఘం ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 24న బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు బాలల హక్కుల సంఘం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో వేయి మంది బాలికలతో కరాటే ప్రదర్శన నిర్వహించనున్నట్లు బాలల హక్కుల సంఘం పేర్కొంది. ఈ కరాటే ప్రదర్శనకు పబ్లిక్ గార్డెన్స్ వేదిక కానుంది. ఆసక్తి ఉన్న పదమూడేళ్ల లోపు బాలికలు హాజరుకావచ్చని, ఎలాంటి ప్రవేశ రుసుం లేదని, ఇందులో పాల్గొన్న బాలికలకు సర్టిఫికెట్లు కూడా అందజేస్తామని బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్ అనురాధారావు తెలిపారు.