తెలంగాణ పోలీసు లోగోకు సీఎం గ్రీన్ సిగ్నల్ | kcr accepts to telangana police logo | Sakshi
Sakshi News home page

తెలంగాణ పోలీసు లోగోకు సీఎం గ్రీన్ సిగ్నల్

Published Tue, Jul 22 2014 2:21 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

తెలంగాణ పోలీసు లోగోకు సీఎం గ్రీన్ సిగ్నల్ - Sakshi

తెలంగాణ పోలీసు లోగోకు సీఎం గ్రీన్ సిగ్నల్

సాక్షి,హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర పోలీసులోగోకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అధికారిక ఉత్తర్వులు వెలువడగానే రాష్ట్ర పోలీసుశాఖ ఈ లోగోను అధికారికంగా ఉపయోగిస్తుంది. ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ ఈ లోగోను రూపొందించగా, ముఖ్యమంత్రి సూచించిన కొన్ని మార్పులు చేర్పులు చేశారని తెలిసింది. ముఖ్యంగా స్కైబ్లూకలర్ బ్యాక్ గ్రౌండ్‌తో బంగారు రంగుతో కూడిన  సింహాలు,అశోకచిహ్నంతో  తెలంగాణ పోలీసు అని పెద్దఅక్షరాలతో  ఈ లోగోను సుందరంగా తీర్చి దిద్దారు. ఉత్తర్వులు రాగానే కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు ఈ లోగోను యూనిఫామ్‌పై ధరిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement