సింగపూర్.. అమెరికా సరసన నిలిచింది! | kcr admires singapore development | Sakshi
Sakshi News home page

సింగపూర్.. అమెరికా సరసన నిలిచింది!

Published Mon, Aug 25 2014 5:58 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

సింగపూర్.. అమెరికా సరసన నిలిచింది! - Sakshi

సింగపూర్.. అమెరికా సరసన నిలిచింది!

హైదరాబాద్:అయిదురోజుల సింగపూర్ పర్యటనను ముగించుకుని ఆదివారం నగరానికి చేరుకున్న కేసీఆర్ ఆ దేశంపై ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం సింగపూర్ పర్యటనకు సంబంధించిన పలు అంశాలను మీడియాతో పంచుకున్న ఆయన.. ఆ పర్యటన అద్భుత అనుభూతిని కలిగించిందన్నారు. ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని ఎలా అభివృద్ధి చెందాలో చెప్పిన దేశం సింగపూర్ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మంచి నీళ్లు కూడా సింగపూర్.. ఇవాళ ఆర్థిక ప్రగతిలో అమెరికా సరసన నిలిచిందన్నారు. సింగపూర్ అభివృద్ధి మంత్రం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

 

ఇవాళ అమెరికా సరసన ఆ దేశం నిలిచిదంటే అక్కడి ప్రభుత్వాలు అనుసరించిన ముందుచూపే ప్రధాన కారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతామని సింగపూర్ లో పలువురు పారిశ్రామివేత్తలు హామీ ఇచ్చారని కేసీఆర్ తెలిపారు. తాను సింగపూర్ లో చేసిన అధ్యయనం తెలంగాణ పునర్ నిర్మాణానికి ఉపయోగపడుతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement