IT sectors
-
రేవంత్ విదేశీ పర్యటన సఫలం అయ్యిందా..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది రోజులపాటు అమెరికా, దక్షిణ కొరియా దేశాలలో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి యత్నించారు. ఇలా ఎవరు చేసినా అభినందించవలసిందే. ఏ ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా కేవలం ప్రచారం కోసం కాకుండా, రాష్ట్రానికి మంచి జరగాలన్న లక్ష్యంతో ఆయా విదేశీ, ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తలను కలిసి తమ వద్ద కూడా పెట్టుబడులు పెట్టాలని కోరితే, వారిలో కొందరైనా అంగీకరిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగం జరుగుతుంది.రేవంత్ విదేశీపర్యటన ద్వారా సుమారు ముప్పైఐదు వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం పరిస్థితులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. అయినప్పటికీ ఈ మేరకు పెట్టుబడులు తేగలిగితే గొప్ప విషయమే. అవన్ని సాకారం అయితే అభినందించవలసిందే. గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా వంటి ఒకటి, రెండు దేశాలకు పెట్టుబడుల నిమిత్తం వెళ్లివచ్చినా, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటనలు చేసి పెట్టుబడులు తీసుకు రావడానికి యత్నించారు. కేటీఆర్ వద్దే ఐటి, పరిశ్రమల శాఖలు ఉండేవి. ఆయన హయాంలోనే ఫార్మాసిటీ ఒక రూపు దిద్దుకుంది.హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డులో ఆదిభట్ల మొదలైన ప్రాంతాలలో కొత్త కంపెనీలు నెలకొల్పడానికి కృషి జరిగింది. దీనికి ముందుగా హైదరాబాద్‌లో ప్రాథమిక సదుపాయాల కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం చాలా గట్టి కృషి చేసిందని చెప్పాలి. రింగ్ రోడ్డుకు కనెక్టివిని బాగా పెంచింది. హైదరాబాద్ పశ్చిమ భాగంలో కాని, ఇటు వరంగల్, విజయవాడ రూట్లలో కాని కొత్త వంతెలను భారీ ఎత్తున చేపట్టి వాహనాల రాకపోకలకు చర్యలు తీసుకుంది. ఐటి రంగానికి విశేష ప్రాధాన్యత ఇచ్చారు. వీటన్నిటి పలితంగానే గత శాసనసభ ఎన్నికలలో హైదరాబాద్, పరిసరాలలో మొత్తం అసెంబ్లీ సీట్లన్నిటిని బీఆర్ఎస్ స్వీప్ చేసిందన్న విశ్లేషణ ఉంది. అదే టైమ్‌లో గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్ బాగా దెబ్బతినడం, ఎమ్మెల్యే అభ్యర్ధులపై తీవ్ర వ్యతిరేకత, కేసీఆర్ వ్యవహారశైలి వంటివాటి కారణాల వల్ల ఆ పార్టీ అధికారం కోల్పోయింది.తదుపరి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ తొలుత కొంత తొందరపాటు ప్రకటనలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉండేవి. ముఖ్యంగా ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం, దానిని ఆయా చోట్ల ఏర్పాటు చేస్తామని అనడంతో ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ యాక్టివిటి బాగా దెబ్బతింది. ఆ తర్వాత రేవంత్ కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చే యత్నం చేశారు. ఆ కృషిలో భాగంగా ఎన్ఆర్ఐ పెట్టుబడులను ఆకర్షించడానికి అమెరికా, దక్షిణ కోరియా టూర్ పెట్టుకున్నారు.దాదాపు పది రోజుల ఈ టూర్లో సుమారు ఏభైకి పైగా సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. అమెరికాలోనే 19 కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకున్నారు. ఇవి కార్యరూపం దాల్చితే ముప్పైవేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. దీని ప్రభావం హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థపై పాజిటివ్‌గా ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్‌లో భారీ విస్తరణకు ముందుకు రావడం శుభ పరిణామం. అలాగే అమెజానన్తో సహా ఆయా సంస్థలు పెట్టుబడులు పెడతామని అంటున్నాయి. వీటిలో స్వచ్ఛ బయో అనే సంస్థపై కొన్ని విమర్శలు వచ్చాయి. అది సీఎంకు సంబంధించినవారి కంపెనీ అని కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయినా ఫర్వాలేదు. ఎవరి కంపెనీ అయినా పెట్టుబడి పెట్టి పదిమందికి ఉపాధి కల్పిస్తే సంతోషించవలసిందే. అయితే ఒప్పందం చేసుకున్న కంపెనీలన్నీ నిజంగానే పెట్టుబడులు పెడతాయి అన్న చర్చ లేకపోలేదు.ప్రతిపాదిత పెట్టుబడులలో పాతిక శాతం నుంచి ఏభై శాతం మొత్తం వచ్చినా ప్రయోజనకరమే. కాకపోతే రేవంత్ తన గురువు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుజాడలలో నడిచి ప్రచారానికి ప్రాముఖ్యత ఇస్తే అది ఆయనకు నష్టం జరగవచ్చు. 2014 టరమ్‌లో చంద్రబాబు నాయుడు విశాఖలో పెట్టుబడుల సదస్సు పెట్టి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చేవారు. తీరా చూస్తే అదంతా ప్రచారార్భాటమేనని ఆ తర్వాత వెల్లడైంది. ఆ పరిస్థితి రేవంత్ తెచ్చుకోకూడదు. అమెరికా టూర్ ద్వారా ఏదో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని పబ్లిసిటీ ఇచ్చుకోకుండా, వాస్తవంగా ఎన్ని ఒప్పందాలు కుదిరితే వాటినే అంటే రూ.32 వేల కోట్ల పెట్టుబడులు అని అధికారికంగా ప్రకటించడం మంచిదే. దాని వల్ల రేవంత్ విశ్వసనీయత పెరుగుతుంది.తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ నగరం ఒక పెద్ద అస్సెట్‌గా మారింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తయారైన అవుటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ స్వరూపస్వభావాలనే మార్చివేసిందని చెప్పాలి. చంద్రబాబు హైదరాబాద్ అంతా తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటారు. పాతికేళ్ల క్రితం ఒక బిల్డింగ్ కట్టి హైటెక్ సిటీ అని పేరు పెట్టి, ఆ ప్రాంతం అంతటికి సైబరాబాద్ అని నామకరణం చేసి మొత్తం నగరాన్ని తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటారు. నిజానికి వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాలు ఒక ప్లాన్ ప్రకారం అభివృద్ధి అయ్యాయి.బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన మాట వాస్తవమే అయినా, ఆ రోజుల్లో మాట్లాడితే లండన్ చేస్తా.. డల్లాస్ చేస్తా అంటూ కేసీఆర్ చేసిన ప్రచారం వల్ల దాని సీరియస్‌నెస్ పోయిందని చెప్పాలి. హుస్సేన్ సాగర్‌లో మురికి నీటిని కొబ్బరినీరులా మార్చుతానంటూ కబుర్లు చెప్పేవారు. మూసి నదిని సుందరంగా తీర్చుదిద్దుతానని అనేవారు. కొంత ప్రయత్నం చేసి ఉండవచ్చు. కాని ఆచరణ సాద్యంకాని మాటలు చెప్పడం వల్ల వ్యంగ్య వ్యాఖ్యలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందే తప్ప ప్రయోజనం కలగదు. ఇప్పుడు అదే బాటలో రేవంత్ కూడా భారీ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. తన హయాంలో ఒక నగరం నిర్మించానని చెప్పుకోవాలని ఆయన ఉబలాటపడుతున్నారు. నిజానికి సిటీల నిర్మాణం ఎవరివల్లకాదు. అందులోను ప్రభుత్వాలు అసలు అలాంటి ప్రయత్నాలు చేయడం సరికాదు.ఒక ప్రణాళికాబద్దమైన అభివృద్ధికి ప్లాన్ చేయాలి కాని, అన్నీ తామే నిర్మిస్తామని, దానిని రియల్ ఎస్టేట్ మోడల్లో తీసుకు వస్తామని అంటే ఎక్కువ సందర్భాలలో అది ఉపయోగపడలేదు. ఉదాహరణకు అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వెంచర్ తరహా అభివృద్దికి శ్రీకారం చుట్టి 2019లో దెబ్బతిన్నారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతుంది. ఏభై వేల ఎకరాల భూమిలో ప్రభుత్వపరంగా అభివృద్ది చేపట్టడం అంటే లక్షల కోట్ల వ్యవహారం అని చెప్పాలి. తాజాగా రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్‌ను న్యూయార్కు సిటీగా మార్చుతానని అంటున్నారు. ప్రత్యేకించి ప్యూచర్ స్టేట్ అనో, ఫ్యూచర్ సిటీ అనో చెప్పి నాలుగో నగరాన్ని నిర్మిస్తానని అంటున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం వృద్ది చేయడంలో బాగంగా అని ఉంటే పెద్దగా తప్పు లేదు. కాని తన ప్రభుత్వమే ఆ వ్యాపారం చేస్తుందని రియల్ ఎస్టేట్ రంగంలో దిగితే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంత ప్రోత్సాహకరంగా లేదన్నది మార్కెట్ వర్గాల విశ్లేషణగా ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నికలు, అంతర్జాతీయ మాంద్య పరిస్తితులు, ఐటి రంగంలో ఉపాది అవకాశాలు తగ్గడం వంటి కారణాలు ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ వాటిన్నిటిని అధిగమించే విదంగా రేవంత్ తన పెట్టుబడుల యాత్రను విజయవంతం చేయగలిగితే ఆయనకు మంచిపేరే వస్తుంది. ఇక మూసి మురుగునీటి నదిని శుద్ది చేస్తామని రేవంత్ కూడా అంటున్నారు. వేల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టుల గురించి మరీ అతిగా ప్రచారం చేసుకుంటే, అది కొంత శాతం అయినా చేయలేకపోతే అవన్ని ఉత్తుత్తి కబుర్లుగా మిగిలిపోతాయి.ఇక గతంలో ఎన్ఆర్ఐలను ఉద్దేశించి రేవంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని ఆయన పీసీసీ అధ్యక్షుడి హోదాలో వ్యాఖ్యలు చేశారు. అలాంటివారి పెట్టుబడులు కావాలని అమెరికా వరకు ఎందుకు వచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు కేటీఆర్ తెలంగాణ నుంచి కొన్ని పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని అంటున్నారు. వాటిలో తొమ్మిదివేల కోట్ల రూపాయల వ్యయంతో పెట్టదలచిన అమరరాజా బాటరీస్ కూడా ఉందని ఆయన చెబుతున్నారు. అలాగే గుజరాత్‌కు ఒక కంపెనీ, చెన్నైకి మరో కంపెనీ తరలిపోయాయని ఆయన చెబుతున్నారు.అది నిజమా? కాదా? దానికి కారణాలు ఏమిటి అన్నదానిపై రేవంత్ సర్కార్ విశ్లేషణ చేసుకుని వాటిలో నిజం ఉంటే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేకుంటే వచ్చే పెట్టుబడుల సంగతి ఎలా ఉన్నా, వెళ్ళే సంస్థల వల్ల తెలంగాణకు అప్రతిష్ట వస్తుంది. హైదరాబాద్ ఇప్పటికే ఐటి సెంటర్‌గా విలసిల్లుతోంది. ఇది కేంద్రీకృత విధానంలో కాకుండా, చుట్టూరా ఉన్న రెండో స్థాయి నగరాలకు వ్యాప్తి చేయగలిగితే అప్పుడు తెలంగాణ దశ-దిశ మారిపోతాయి. అది అంత తేలిక కాదు.గతంలో కేటీఆర్ కూడా వరంగల్, ఖమ్మం వంటి చోట్ల ఐటీని అభివృద్ధి చేయాలని ప్రయత్నించారు. కాని అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని అంటారు. ఏది ఏమైనా రేవంత్ టూర్ కేవలం రియల్ ఎస్టేట్ టూర్‌గా కాకుండా, ఉపాది, ఉద్యోగ అవకాశాలు పెంచే పరిశ్రమల స్థాపన టూర్‌గా విజయవంతం అయితే అభినందించవచ్చు. ఈ టూర్ సఫలం అయిందా? లేదా? అన్నది తేలడానికి కొంత టైమ్ పడుతుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఈ ఉద్యోగాలకు ఏమైంది?
మొన్న మైక్రోసాఫ్ట్, ట్విట్టర్... నిన్న వాట్సప్, ఫేస్‌బుక్‌ల మాతృసంస్థ మెటావర్స్... నేడు అమెజాన్... హెచ్‌పీ! వరుసగా ఉద్యోగాల్లో కోతల వార్తలే. అమెరికన్ టెక్ సంస్థలు అనేకం ఉద్యోగస్థుల్ని తగ్గించుకొనే పనిలో పడడంతో వేలమంది వీధిన పడనున్నారు. సదరు సంస్థల భారతీయ శాఖల్లో పనిచేస్తున్న మనవాళ్ళ మీదా అనివార్యంగా ఆ ప్రభావం ఉండనుంది. ఏ రోజు ఏ కంపెనీ ‘పింక్ స్లిప్’ ఇస్తుందో తెలియని కంగారు పుట్టిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం సహా అనేక పరిణామాలతో ద్రవ్యోల్బణం పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తుగా మారింది. లాభాలు పడిపోతూ, ప్రపంచమంతటా మాంద్యం తప్పదనే భయం నెలకొంది. అమెజాన్ నుంచి డిస్నీ దాకా దిగ్గజ టెక్ సంస్థలు శ్రామికశక్తిని పునర్వ్యవస్థీకరించు కుంటున్నదీ అందుకే. ఎక్కడికెళ్ళి ఆగుతుందో తెలియని ఈ పరిస్థితి భారత్ సైతం అప్రమత్తం కావాలని గుర్తుచేస్తోంది. శ్రామికశక్తి పునర్మూల్యాంకనంతో ఈ ఏడాది ఇప్పటి వరకు 850కి పైగా టెక్ కంపెనీల్లో లక్షా 37 వేల వైట్ కాలర్ ఉద్యోగులు ఇంటి బాట పట్టాల్సి వచ్చిందని ఓ అంతర్జాతీయ అంచనా. లిఫ్ట్, స్ట్రైప్, కాయిన్‌బేస్, షాపిఫై, నెట్‌ఫ్లిక్స్, శ్నాప్, రాబిన్‌హుడ్, చైమ్, టెస్లా అనేక సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికా కేంద్రంగా నడుస్తున్న భారీ సంస్థలు ఒక్క గత నెలలోనే 33,843 ఉద్యోగాలకు మంగళం పలికాయి. ఉద్యోగాల కోత సుమారు 13 శాతానికి ఎగబాకింది. 2021 ఫిబ్రవరి నుంచి గత నెల వరకు చూస్తే – ఒకే నెలలో ఇన్ని ఉద్యోగాలపై వేటు పడడం ఇదే అత్యధికం. పులి మీద పుట్రలా గూగుల్ సైతం ఈ వారం ఉద్వాసనల బాట పట్టింది. లక్షా 87 మందితో టెక్ రంగంలో అతి పెద్ద ఉద్యోగ సంస్థ అయిన గూగుల్ 10 వేల మందిని ఇంటికి సాగనంపడానికి సిద్ధమవుతోందని ప్రాథమిక వార్త. ఆ సంస్థకు అననుకూలమైన మార్కెట్ పరిస్థితులు నెలకొన్నాయి. పైపెచ్చు సంస్థలో గణనీయమైన వాటాతో యాజమాన్య నిర్ణయాలను ప్రభావితం చేసే ‘యాక్టివిస్ట్ హెడ్జ్ ఫండ్’ నుంచి ఒత్తిడి ఉంది. అలా 6 శాతం మంది ఉద్యోగులను తగ్గించుకొనే పనిలోకి దిగింది. పని తీరులో రేటింగు అతి తక్కువగా ఉన్నవారినే తొలగిస్తామన్నది గూగూల్ చెబుతున్న మాట. దానికి సమర్థమైన ర్యాంకింగ్ విధానం ఉందంటున్నా, అది ఏ మేరకు లోపరహితమో చెప్పలేం. ప్రస్తుత కోతల పరిస్థితి గూగుల్ స్వయంకృతమని నిపుణుల మాట. అవసరానికి మించి శ్రామిక శక్తి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా, పెడచెవిన పెట్టి గత త్రైమాసికంలో ఆ సంస్థ ఎడాపెడా కొత్త ఉద్యోగస్థుల్ని తీసుకుంది. అదీ భారీ వేతనాలకు తీసుకోవడం మెడకు గుదిబండైంది. లాక్డౌన్లలో పని నడపడానికి అమెరికా లాంటి చోట్ల తీసుకున్న ఉద్యోగాలు ఇప్పుడు వాటికి ఎక్కువయ్యాయి. ఉద్యోగస్థానాల్లో గణనీయంగా ఊపందుకున్న ఆటోమేషన్ ప్రభావం సరేసరి. వెన్నాడుతున్న ఆర్థిక మాంద్యానికి తోడు కరోనా అనంతర విక్రయాలు తగ్గాయి. ఫలితంగా పదేళ్ళుగా వీర విజృంభణలో ఉన్న టెక్‌సంస్థలు కొత్త వాస్తవాన్ని జీర్ణించుకోవాల్సి వచ్చింది. ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి సంస్థ హెచ్‌పీ వచ్చే 2025 చివరికి 6 వేల ఉద్యోగాలను తగ్గించుకుంటామని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ 10 వేల మందికి పింక్ స్లిప్పులు ఇస్తామనేసరికి, మన దేశంలోని దాని శాఖలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. ‘మీ అంతట మీరు ఉద్యోగాలు వదిలేయం’డంటూ అమెజాన్ ఇండియా తన ఉద్యోగులకు ‘స్వచ్ఛంద వీడ్కోలు పథకం’ (వీఎస్పీ) ప్రకటించడం చర్చ రేపుతోంది. మూకుమ్మడిగా ఇంటికి సాగనంపడాన్ని వ్యతిరేకిస్తూ మన కార్మిక శాఖకు ఫిర్యాదులు రావడం, వీఎస్పీ వివరాలను అందించాలంటూ మన ప్రభుత్వం ఇక్కడి శాఖను అడగడం చకచకా జరిగాయి. నిజానికి, కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా, ఐరోపాలు మూడూ బాగా మందగించాయి. అందుకే, వచ్చే 2023లో ప్రపంచానికి మాంద్యం తప్పదని వరల్డ్ బ్యాంక్ అధ్యయనం. ప్రపంచ ఆర్థికాభివృద్ధి నిదానించి, మరిన్ని దేశాలు మాంద్యం లోకి జారితే వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లోని ప్రజానీకం దుష్పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది. ప్రపంచానికి మెడ మీద కత్తిలా మాంద్యం భయపెడుతున్న వేళ, మనమూ అప్రమత్తం కావాలి. ప్రపంచీకరణతో ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ విపణికి మనం ముడిపడి ఉన్నాం. ముందు జాగ్రత్త చర్యలకు దిగాలంటున్నది అందుకే. రానున్న పరిణామాల్ని దీటుగా ఎదుర్కోవడానికి ఏ మేరకు సిద్ధంగా ఉన్నామన్నది కీలకం. ప్రపంచశ్రేణి టెక్ సంస్థల కార్యకలాపాల్లో మన ఐటీ సంస్థల ప్రమేయముంది గనక ఉద్యోగ విపణిలో సంక్షోభం తలెత్తకుండా ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. ఐటీ రంగంలో మొదలైన కోతలు ఇతర రంగాలకూ పాకే ముప్పుంది. సత్వరం మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే మార్గాలు వెతకాలి. అదనపు పెట్టుబడులు వచ్చేలా, ఉత్పాదకత పెరిగేలా విధానాలు నిర్ణయించడం దారిద్య్ర నిర్మూలనకూ, వృద్ధికీ కీలకం. కార్మిక హక్కులను నీరుగార్చి, ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియని అనిశ్చితి, అభద్రత కల్పించడం ఏ రంగానికైనా మంచివి కావు. అసలే కరోనాలో ఉపాధి పోయి రోజువారీ శ్రామికులు చిక్కుల్లో ఉన్నారు. ఇప్పుడు వైట్ కాలర్ ఐటీ రంగ ఉద్యోగుల పరిస్థితీ అదే అంటే ఉన్న సంక్షోభం ఇంకా తీవ్రమవుతుంది. ఇప్పటికీ మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మెరుగ్గా ఉందంటున్న పాలకులు మేకిన్ ఇండియా స్వప్నాలను చూపడమే కాక, ఉద్యోగక్షేత్రంలోనూ దాని ఫలాలు అందించగలిగితే మంచిది. కిందపడ్డా మళ్ళీ పైకి లేస్తాం! -
ఐటీలో ‘ఫేక్’ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే!
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం పరిస్థితి అంతగా బాలేదు. దీనికి తోడు ఆర్థిక మాంద్యం కంపెనీలను భయపెడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. ప్రస్తుతం నకిలీ పత్రాలు, ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అంశం ఐటీలో కలకలం రేపుతోంది. ఇటీవల నియమాలను ఉల్లఘించి, నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన పలువురిని ప్రముఖ కంపెనీ యాక్సెంచర్ తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సైతం చేరింది. యాక్సెంచర్ బాటలో కాగ్నిజెంట్.. తమ ఉద్యోగుల్లో బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్‌లో విఫలమైన వారిపై వేటు వేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కొందరు నకిలీ పత్రాలు సమర్పించి ఉద్యోగాల్లో చేరిన 6 శాతం మంది సిబ్బందిని తొలగించినట్టు కాగ్నిజెంట్ ఇండియా తెలిపింది. ఈ అంశంపై కంపెనీ ఇండియా హెడ్ రాజేష్ నంబియార్ మాట్లాడుతూ.. ‘ఎంపిక చేసిన పోస్ట్‌కు వారి సరిపోరని కంపెనీ జరిపిన బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్‌లో తేలింది. బ్యాక్‌గ్రౌండ్ చెక్‌ను క్లియర్ చేయనివారిని కంపెనీ ఏ మాత్రం ఉపేక్షించేది లేదని’ స్పష్టం చేశారు. సాధారణంగా నియామక ప్రక్రియ ఆలస్యం అవుతుందని, కంపెనీలు అభ్యర్థులను సంస్ధలోకి తీసుకునేముందు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవు. ఒక్కోసారి ఈ ప్రక్రియ పాటించడం వల్ల ఉద్యోగులు తమ కంపెనీలో చేరేందుకు ఆసక్తి కూడా చూపరని భావిస్తూ.. వీటిపై సరైన శ్రద్ధ పెట్టవు. అయితే కరోనా సమయంలో మాత్రం పెద్ద ఎత్తున ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాల్లో చేరారు. అయితే రానున్న సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా నియామకాలకు కూడా ఫుల్స్టాప్ పెట్టాయి. ఇదిలా ఉండగా.. ఇదే తరహాలోనే మిగిలిన కంపెనీలు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌ను చూస్తే వేల మంది సిబ్బంది వారి ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు! -
అసలేం జరుగుతోంది, ఊడిపోతున్న ఉద్యోగాలు.. ప్రముఖ కంపెనీలో 11వేల మందిపై వేటు!
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం కంపెనీలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపులపై తాజాగా స్పందించారు. తమ కంపెనీలో పని చేస్తున్న వారిలో దాదాపు 13 శాతం ( 11,000 మందికి) పైగా ఉద్యోగులపై వేటు వేయాలని కంపెనీ నిర్ణయించినట్లు ఈ సందర్భంగా జుకర్‌బర్గ్ తెలిపారు. ఫేస్బుక్ సీఈఓ ఉద్యోగులకు రాసిన లేఖలో.. “ఈ రోజు నేను మెటా చరిత్రలో చేసిన కొన్ని కష్టతరమైన మార్పులను షేర్ చేస్తున్నాను. నేను మా బృందం పరిమాణాన్ని సుమారు 13% తగ్గించాలని నిర్ణయించుకున్నాను. మా ప్రతిభావంతులైన ఉద్యోగులలో 11,000 కంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నాం. ఇది నాకు ఎంతో బాధను కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు జుకర్‌బర్గ్. ఉద్యోగాలు కోల్పోయే సిబ్బందికి కనీసం నాలుగు నెలల జీతాన్ని అందించనున్నట్లు సంస్థ హెచ్ఆర్ విభాగం అధిపతి లోరీ గోలెర్ తెలిపారు. ఇక ఈ ఉద్యోగాల తొలగింపు కంపెనీ 18 సంవత్సరాల చరిత్రలో భారీగా తొలగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం అకస్మాత్తుగా ఉద్యోగుల తొలగింపుకు ప్రధాన కారణాలు..కంపెనీ ఖర్చను భారీగా తగ్గించుకోవడం, ఆర్ధిక మాంద్యం కారణంగా సంస్థలు అడ్వటైజ్మెంట్లకు కోసం పెట్టే ఖర్చును తగ్గించుకోవడం, కంపెనీని ఇటీవల వరుసగా చుట్టుముడుతున్న వివాదాల కారణంగా సంస్థపై నియంత్రణ వంటి అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు! -
మళ్లీ ఐటీలోకి వచ్చేది లేదు..
న్యూఢిల్లీ: వ్యాపారాల్లో కీలకంగా వ్యవహరించే ప్రతిభావంతులైన ఉద్యోగులను అట్టే పెట్టుకోవడం ఐటీ రంగంలో చాలా కష్టంగా మారుతోంది. గత రెండేళ్లుగా ఇది మరింత తీవ్రమవుతోంది. ప్రొఫెష నల్స్‌లో చాలా మంది భవిష్యత్తులో ఈ రంగానికి తిరిగి రావద్దు అని భావిస్తుండటమే ఇందుకు కార ణం. ఐటీ రంగానికి నియామకాల సర్వీసులు అందించే టీమ్‌లీజ్ డిజిటల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఉద్యోగుల అవసరాలు, ప్రాధాన్యతలు మారిపోయాయి. వారు ఉద్యోగ నిబంధనల్లో సరళత్వం, కెరియర్లో వృద్ధి అవకాశాలు, ఉద్యోగులకు దక్కే ప్రయోజనాలు మొదలైన వాటి ఆధారంగా తమ కెరియర్లను మదింపు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో రెండంకెల స్థాయిలో 25 శాతం మేర అట్రిషన్ నమోదవుతోంది. 100 మంది పైగా నిపుణులు, ఐటీ రంగానికి సంబంధించిన వారితో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా టీమ్‌లీజ్ ఈ నివేదిక రూపొందించింది. ‘గత దశాబ్దకాలంలో దేశీ ఐటీ రంగం గణనీయంగా విస్తరించింది. అత్యంత వేగంగా 15.5 శాతం మేర వృద్ధితో 227 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. 2022 ఆర్థిక సంవత్సరంలోనే అదనంగా 5.5 లక్షల ఉద్యోగాలను కల్పించింది‘ అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ చెమ్మన్‌కోటిల్ తెలిపారు. మారుతున్న ట్రెండ్.. : అయితే, కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఐటీ నియామకాల ధోరణిలో పెను మార్పులు వచ్చా యి. వ్యాపారాలకు కీలకమైన ప్రతిభావంతులను అట్టే పెట్టుకోవడం ఐటీ కంపెనీలకు గత రెండేళ్లుగా కష్టంగా మారుతోంది. సర్వే ప్రకారం 57 శాతం మంది ప్రొఫెషనల్స్ భవిష్యత్తులో ఐటీ సర్వీసుల రంగానికి తిరిగి వచ్చే యోచన లేదని తెలిపారు. జీతాల పెంపు, ఇతర ప్రయోజనాలు ఎలాగూ ఉండేవే అయినా ఉద్యోగాలు మారడంలో కొత్త సంస్థల అంతర్గత విధానాలు కూడా ఉద్యోగులకు ఆకర్షణీయంగా ఉంటున్నాయని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో పని, వ్యక్తిగత జీవితం గురించి ఉద్యోగుల అభిప్రాయాల్లో వస్తున్న మార్పులను కూడా దృష్టి లో పెట్టుకుని కంపెనీలు తమ విధానాలను రూపొందించుకోవాల్సి ఉంటోందని తెలిపింది. ఉద్యోగులు, వారి అభ్యున్నతి లక్ష్యంగా కంపెనీల నియామక ప్రణళికలు వ్యూహాత్మకంగా ఉండాలని పేర్కొంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్: మాకొద్దీ ఉద్యోగాలు, ఐటీ కంపెనీలకు మహిళా ఉద్యోగుల భారీ షాక్!
కరోనా కారణంగా మానవ జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఆఫీస్ వర్క్ విషయంలో ఎన్నడూ ఊహించని విధంగా కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వర్క్ ఫ్రమ్ నుంచి ఆఫీస్‌లో పనిచేసేందుకు ఇష్టపడని మహిళా ఉద్యోగులు..మాకీ ఉద్యోగాలు వద్దు బాబోయ్ అంటూ రిజైన్ చేస్తున్నారు. దీంతో కొత్త ఉద్యోగుల నియామకం కంపెనీలకు కత్తిమీద సాములా మారింది. ఇటీవల విడుదలైన ఓ రిపోర్ట్ ప్రకారం..2020తో పోలిస్తే 2021 జనవరి - జూన్ మధ్య కాలంలో ఐటీ సెక్టార్లో పనిచేస్తున్న మహిళలు వారి ఉద్యోగాల్ని వదిలేసినట్లు తెలుస్తోంది. అందుకు కారణం.. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఐటీ కంపెనీలన్నీ ఇంటి నుంచి పనిచేసే విధానానికి స్వస్తి చెప్పి..ఆఫీస్‌కు రావాల్సిందేనంటూ ఉద్యోగులకు మెయిల్స్ పెట్టడమేనని ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగులు వారి జాబ్స్‌కు రిజైన్ చేస్తున్నారు. ఇలా జాబ్ వదిలేస్తున్న వారిలో 40శాతం నాన్ మేనేజిరియల్ లెవల్, 20శాతం మేనేజిరియల్, కార్పోరేట్ ఎగ్జిగ్యూటీవ్ లెవల్ ఉద్యోగులు ఉన్నట్లు ఆ రిపోర్ట్ పేర్కొంది. అవతార్(avtar)-సీరమౌంట్ సంస్థలు బెస్ట్ కంపెనీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా రిపోర్ట్ -2021 పేరిట సర్వే నిర్వహించాయి. ఆ సర్వేలో ఐటీ/ఐటీఈఎస్( information technology enabled services) సెక్టార్లలో అట్రిషన్ రేటు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ఆ అధ్యయనంలో ఆసక్తిరంగా 2016 ఐటీ విభాగంలో 10శాతం మహిళా ఉద్యోగులు పెరగ్గా..వారి సంఖ్య 2021 నాటికి 34.5శాతంగా ఉంది. కానీ అనూహ్యంగా 2020 -2021 మధ్యకాలంలో పెరిగిన మహిళ ఉద్యోగుల శాతం 4.34గా ఉండడం ఐటీ సెక్టార్‌ను కలవరానికి గురి చేస్తుంది. ఇక ఐటీ/ఐటీఈఎస్ విభాగంలో మహిళల ప్రాధాన్యం విషయానికొస్తే.. 2020లో 31 శాతం ఉండగా 2021లో 32.3శాతానికి పెరిగింది. మేనేజిరియల్ లెవల్స్ 2020లో 19శాతం ఉండగా 2021కి 21శాతం పెరిగింది. ఈ సందర్భంగా అవతార్ ప్రతినిధి మాట్లాడుతూ..వర్క్‌లో ఒత్తిడి,ఆందోళనను తగ్గించుకోవడానికి ఉద్యోగాలకు రిజైన్ చేస్తున్నట్లు తాము గుర్తించినట్లు చెప్పారు. మహిళా ఉద్యోగులు ఆఫీస్‌కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడం శారీరకంగా, మానసికంగా అనేక సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. టీమ్‌లీజ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రితుపర్ణ చక్రవర్తి మాట్లాడుతూ..కోవిడ్ కారణంగా వర్క్ కల్చర్‌లో వచ్చిన మార్పుల కారణంగా మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగింది.అట్రిషన్ రేటు తగ్గిందని అన్నారు. కానీ ఇప్పుడు రిటర్న్ టూ ఆఫీస్ వల్ల ఉద్యోగం చేయాలనే ఆసక్తి తగ్గి, ఉద్యోగాల్ని వదిలేస్తున్నట్లు చెప్పారు. అయితే కార్యాలయాల్ని ఆరోగ్య పరంగా, సౌకర్య వంతంగా మార్చితే సానుకూల ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. చదవండి: Work From Home: అమ్మాయిలూ.. అవకాశాలివిగో! -
కొత్తగా 4.5 లక్షల కొలువులు..సానుకూలంగా రిక్రూట్మెంట్స్..!
ముంబై: కరోనా మహమ్మారి పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా డిజిటైజేషన్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం 227 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. దశాబ్దకాలంలోనే అత్యధిక స్థాయిలో 15.5 శాతం వృద్ధి నమోదు చేయనుంది. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వ్యూహాత్మక సమీక్ష సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ మంగళవారం ఈ విషయాలు వెల్లడించింది. మహమ్మారి పరిణామాలు తలెత్తిన వెంటనే పరిశ్రమ దీటుగా ఎదురునిల్చిందని, మరుసటి ఏడాది గణనీయంగా పుంజుకుందని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ పేర్కొన్నారు. కోవిడ్ పూర్వం కన్నా రెట్టింపు స్థాయి వృద్ధి సాధించనుందని ఆమె తెలిపారు. 2021 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయాలు 2.3 శాతం వృద్ధి చెంది 194 బిలియన్ డాలర్లకు చేరినట్లు వివరించారు. నాస్కామ్ ప్రకారం.. 2021–22లో కొత్తగా 4.5 లక్షల కొత్త కొలువులు రావడంతో ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య మొత్తం 51 లక్షలకు చేరనుంది. కొత్తగా రిక్రూట్ అయిన వారిలో 44 శాతం వాటాతో.. మొత్తం ఉద్యోగుల్లో మహిళల సంఖ్య 18 లక్షలుగా చేరుతుంది. 2026 నాటికి 350 బిలియన్ డాలర్లకు.. కొన్నాళ్లుగా వృద్ధి అంచనాలను ప్రకటించడాన్ని నిలిపివేసిన నాస్కామ్.. తాజా పరిణామాల దన్నుతో దేశీ ఐటీ పరిశ్రమ 2026 నాటికి 350 బిలియన్ డాలర్లకు చేరగలదని ధీమా వ్యక్తం చేసింది. ఇందుకు అవసరమైన సామర్థ్యాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని ఘోష్ పేర్కొన్నారు. దీనికోసం విధానకర్తలు కూడా కొంత తోడ్పాటు అందించాలని కోరారు. తొలి 100 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించడానికి పరిశ్రమకు 30 ఏళ్లు పట్టగా, రెండో బిలియన్ డాలర్ల మార్కును దశాబ్దకాలంలోనే సాధించినట్లు ఆమె తెలిపారు. మరోవైపు, ఐటీ పరిశ్రమ వృద్ధిని స్వాగతించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్..పరిశ్రమకు అవసరమైన పూర్తి మద్దతును ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఎగుమతులు 17 శాతం అప్.. నాస్కామ్ ప్రకారం.. సమీక్షా కాలంలో ఎగుమతి ఆదాయాలు 17.2 శాతం పెరిగి 178 బిలియన్ డాలర్లకు చేరనుండగా, దేశీయంగా ఆదాయాలు 10 శాతం వృద్ధితో 49 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. కీలక విభాగాల వారీగా చూస్తే.. సైబర్‌సెక్యూరిటీ, ఇంటెలిజెంట్ ఆటోమేషన్, అనలిటిక్స్‌కు డిమాండ్ నేపథ్యంలో ఐటీ సర్వీసుల ఆదాయం 16.9 శాతం, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వృద్ధి అత్యధికంగా 18.7 శాతం, హార్డ్‌వేర్ అత్యంత తక్కువగా 7.3 శాతంగా నమోదు కానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా వృద్ధి జోరు కొనసాగుతుందని సీఈవోలు ఆశావహంగా ఉన్నట్లు నాస్కామ్ సర్వేలో తేలింది. ఫార్మా/హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఆర్థిక సర్వీసులు, బీమా, తయారీ, రిటైల్/ఈ–కామర్స్ మొదలైన రంగాల కంపెనీల ఐటీ వ్యయాలు ఎక్కువగా ఉండగలవని సీఈవోలు అభిప్రాయపడ్డారు. అలాగే, 2022–23లోనూ రిక్రూట్మెంట్పై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. గరిష్ట స్థాయికి అట్రిషన్.. అట్రిషన్ సమస్య గరిష్ట స్థాయికి చేరిందని, ఇక నుంచి క్రమంగా తగ్గగలదని నాస్కామ్ వైస్ చైర్మన్ కృష్ణన్ రామానుజం తెలిపారు. టాప్ 10 ఐటీ కంపెనీల డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు చూస్తే ఉద్యోగుల వలసలు.. మరీ తగ్గకపోయినప్పటికీ, ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘ఇది గరిష్ట స్థాయికి చేరి ఉంటుందని, ఇక నుంచి పరిస్థితులు మెరుగుపడగలవని ఆశాభావం నెలకొన్నట్లుగా కనిపిస్తోంది‘ అని ఆయన వివరించారు. ప్రతిభావంతులు చేజారిపోకుండా చూసుకోవడం ఇటు పరిశ్రమకు అటు దేశానికి ముఖ్యమని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ పేర్కొన్నారు. ఇందుకోసం కంపెనీలు, నాస్కామ్ కూడా పలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. ఇటీవల కొన్ని త్రైమాసికాల్లో అట్రిషన్ ఏకంగా 20 శాతం పైగా నమోదైన నేపథ్యంలో తాజా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చిన్న పట్టణాల్లో మైక్రో ఐటీ హబ్‌లు.. బెంగళూరు, హైదరాబాద్, పుణే వంటి నగరాలకు పరిమితమైన ఐటీ కార్యకలాపాలను చిన్న పట్టణాలకు కూడా విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఘోష్ చెప్పారు. ఇండోర్, జైపూర్, కోల్‌కతా, కోయంబత్తూర్, అహ్మదాబాద్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి సెంటర్లలో మైక్రో ఐటీ హబ్‌లు ఏర్పాటయ్యాయని ఆమె వివరించారు. చిన్న పట్టణాలకు ఐటీ మరింతగా విస్తరించాలంటే నిరంతర విద్యుత్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలతో పాటు నిపుణుల లభ్యత, తగినంత ఉద్యోగావకాశాలు కల్పించే పరిస్థితి ఉండాలని ఘోష్ తెలిపారు. చదవండి: జనవరిలో ఎగుమతుల్లో 25% వృద్ధి -
హైదరాబాద్‌కే కాదు ఆదిలాబాద్‌కి వస్తున్నాయ్! తెలంగాణలో కొత్త శకం?
అక్షరమాలలో మొదటి స్థానంలో ఉన్నా అభివృద్ధిలో చివరి వరుసలో ఉండే జిల్లాగా పేరు పడిన ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ రంగం అడుగు పెట్టింది. ఆదిలాబాద్‌లో ఐటీ కంపెనీ పెట్టేందుకు ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ అంగీకారం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసింది. ఎట్టీటీ ఎండీ, సీఈవో సంజీవ్ దేశ్‌పాండేకు ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు వరంగల్ ఇతర జిల్లా కేంద్రాలకు ఐటీ పరిశ్రమను చేరువచేసే పనిలో ఉంది. ఇప్పటికే వరంగల్‌లో టెక్ మహీంద్రా, సెయింట్, మైండ్‌ట్రీ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలపగా ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లలో సైతం ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వీటి సరసన ఆదిలాబాద్ కూడా చేరింది. మిగిలిన జిల్లా కేంద్రాలతో పోల్చితే ఆదిలాబాద్‌కి అనేక ప్రతికూలతలు ఉన్నా.. అన్నింటినీ అధిగమించి ఐటీలో దూసుకుపోయేందుకు రెడీ అయ్యింది. Happy news for Adilabad 😊 Met & thanked Sri Sanjeev Deshpande @deshsan1g MD & CEO, @NDBS_India who came forward to set up new IT business services centre in Adilabad town#Telangana Govt is committed to taking IT to Tier 2 towns & this is yet another big step forward 👍 pic.twitter.com/P1xJzi5v8B — KTR (@KTRTRS) January 26, 2022 -
ఐటీకి కష్టకాలం!!
బెంగళూరు: దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం గతంలో ఎన్నడూ చూడనంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోందని ఐటీ రంగ నిపుణుడు ఎస్ మహాలింగం వ్యాఖ్యానించారు. ఆసియా సంక్షోభం, వై2కే, 2008 ఆర్థిక మాంద్యం లాంటి వాటిని కూడా దేశీ ఐటీ కంపెనీలు గట్టెక్కాయని .. కానీ ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి వీటన్నింటి కన్నా భిన్నంగా ఉందని ఆయన చెప్పారు. ‘నేను 1970లో ఐటీ రంగంలో అడుగుపెట్టాను. గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోందని. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల పునరుద్ధరణకు చాలా సమయం పట్టేస్తుంది. వలస నిబంధనలు మొదలుకుని చాలా అంశాలు పెను మార్పులకు లోనవుతాయి‘ అని మహాలింగం వివరించారు. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో మహాలింగం గతంలో సీఎఫ్ఓగా, ఈడీగా వ్యవహరించారు. విశ్వసనీయతకు మారు పేరు.. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే భారత కంపెనీలు విశ్వసనీయ భాగస్వాములని ఈ సంక్షోభంతో నిరూపితమైందని మహాలింగం చెప్పారు. లాక్డౌన్ వేళ కూడా సర్వీసుల డెలివరీలో సమస్యలు తలెత్తకుండా దేశీ ఐటీ కంపెనీలు వినూత్నమైన పరిష్కార మార్గాలు అమలు చేస్తున్నాయని ఆయన కితాబిచ్చారు. లాక్డౌన్ ఎత్తివేశాక.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ కార్యకలాపాల నిర్వహణ తీరును పునఃసమీక్షించుకోగలవని.. తద్వారా ఐటీ సంస్థలకు పుష్కలమైన వ్యాపార అవకాశాలు లభించగలవని మహాలింగం తెలిపారు. నిర్మాణ, తయారీ రంగ కంపెనీల్లో ఐటీ మరింత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సిలికాన్ వేలీలో కోతలు.. అమెరికాలో ఐటీ కంపెనీలకు కేంద్రమైన సిలికాన్ వేలీలో స్టార్టప్ సంస్థలు.. ఉద్యోగాలు, జీతాల్లో కోతలకు సిద్ధమవుతున్నాయి. పెద్ద ఐటీ కంపెనీలు.. కొత్త నియామకాలను కొంత కాలం నిలిపివేసే యోచనలో ఉన్నాయి. ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టు, వ్యాపారవేత్త ఎం రంగస్వామి ఈ విషయాలు తెలిపారు. సిలికాన్ వేలీలో వచ్చే నెల రోజుల్లో నిరుద్యోగిత భారీగా పెరిగే అవకాశం ఉందని, 2008 నాటి మాంద్యం సమయంలో కూడా చూడనంత స్థాయిలో ఉండొచ్చన్నారు. -
ఐటీలో 8.73 లక్షల ఉద్యోగాలు వచ్చాయ్!
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగిత పెరిగిపోయిందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో గత ఐదేళ్లలో కొత్తగా 8.73 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ప్రత్యక్షంగా 41.40 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, 1.2 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని తెలిపారు. ‘నేను నా సొంత డేటా బట్టి చెప్పడం లేదు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ గణాంకాల ఆధారంగానే మాట్లాడుతున్నాను. ఉద్యోగాల గణాంకాలపై కాంగ్రెస్ అన్ని అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. నేను వాస్తవాల ఆధారంగా మాట్లాడుతున్నాను‘ అని ఆయన వివరించారు. నిరుద్యోగిత సంక్షోభం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్... తమ పదేళ్ల హయాంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించగలిగిందో చెప్పాలన్నారు. గడిచిన కొన్నాళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు, ఇన్ఫ్రా ప్రాజెక్టులు పుంజుకోవడంతో.. గణనీయంగా ఉద్యోగాల కల్పన జరిగిందని మంత్రి చెప్పారు. ‘దేశ ఎకానమీ 7.4% పైగా వృద్ధి సాధిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. తయారీ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. అలాగే అంతర్జాతీయంగా భారత ఎకానమీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. వీటన్నింటి ఫలితంగా మరిన్ని ఉద్యోగాల కల్పన జరుగుతోంది‘ అన్నారు. -
‘ఏఐ’తో ఐటీ ఉద్యోగాలకు ముప్పేమీ లేదు...
ముంబై: ఐటీ రంగంలో జీతాల తేటెతుట్టెను ఇన్ఫీ నారాయయణ మూర్తి మరోసారి కదిపారు. సాఫ్ట్వేర్ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్న ఇలాంటి సమయంలో మేనేజ్మెంట్ స్థాయిలోని సీనియర్ ఉద్యోగులు తమ వేతనాలను భారీగా పెంచుకోవడం ఆమోదయోగ్యం కాదని మూర్తి పేర్కొన్నారు. ఐఐటీ–బాంబేలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థపై(క్యాపిటలిజం) సామాన్యులకు నమ్మకాన్ని పెంపొందించాలంటే... సీనియర్లు తమ జీతాల విషయంలో త్యాగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), యాంత్రీకరణ(ఆటోమేషన్) కారణంగా పరిశ్రమలో ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలను తోసిపుచ్చారు. ఐటీనే తీసుకుంటే... వాస్తవాలను పక్కనబెట్టి వీటిని మరీ అతిగా చూపుతున్నారని స్పష్టం చేశారు. ‘జూనియర్ ఉద్యోగులకు జీతాలను పెంచకపోవడం ఆందోళనకలిగిస్తోంది. మరోపక్క, సీనియర్ల జీతాలు భారీగా పెరుగుతుండటం శ్రేయస్కరం కాదు. ఇలాంటి ధోరణులతో పెట్టుబడిదారీ వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం కలిగించలేం. దేశంలో కోట్లాదిమంది ప్రజలు పేదరికంలో ఉన్నారని మరవొద్దు’ అని మూర్తి పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్సిక్కా, ఇతరత్రా కొందరు సీనియర్లకు భారీ వేతన ప్యాకేజీల విషయంలో మూర్తి గతంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం.. సిక్కా వైదొలగడం తెలిసిందే. ఐటీలో సమస్యలు తాత్కాలికమే...: ప్రస్తుతం ఐటీ రంగం కష్టకాలంలో ఉందని మూర్తి అంగీకరించారు. అయితే, కొన్నేళ్లకోసారి ఇలాంటి పరిస్థితులు నెలకొనడం(సైక్లికల్) సాధారణమేనని.. పరిశ్రమ మళ్లీ గాడిలోపడుతుందని అభిప్రాయపడ్డారు. ‘అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన కంపెనీలు మన ఐటీ రంగానికి ప్రధానమైన క్లయింట్లుగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు మళ్లీ కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ముందు ఇప్పటివరకూ వెచ్చించినదానిపై ప్రయోజనాల కోసం వేచిచూస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఐటీ పరిశ్రమ మందగమనాన్ని చవిచూడాల్సి వస్తోంది’ అని పేర్కొన్నారు. -
నగరం చుట్టూ 14 ఐటీ క్లస్టర్లు
-
సిటీకి ఐటీ హారం
నగరం చుట్టూ 14 ఐటీ క్లస్టర్లు ఐటీఐఆర్‌లో భాగంగా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సైబరాబాద్, విమానాశ్రయం పరిధిలోనే 82 శాతం ప్రాజెక్టు ఏరియా ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు హెచ్ఎండీఏకు బృహత్ ప్రణాళిక రూపకల్పన బాధ్యతలు ఆశిస్తున్న పెట్టుబడులు 2,19,440 కోట్లు ఐటీఐఆర్ మౌలిక స్వరూపం.. ప్రాజెక్టు ఏరియా :49,913 ఎకరాలు ఆశిస్తున్న పెట్టుబడులు :2,19,440 కోట్లు ఉద్యోగావకాశాలు :15.4 లక్షలు (ప్రత్యక్షంగా) : 50.4 లక్షలు (పరోక్షంగా) మౌలిక సదుపాయాల కోసం కేంద్రమిచ్చే సాయం :4,863 కోట్లు కేంద్రం మంజూరు చేసింది : 3,275 కోట్లు ప్రాజెక్టు కాల పరిమితి తొలి విడత : 2013 - 2018 రెండో విడత : 2018 -2038 ఐటీ క్లస్టర్ల ఏర్పాటుకు గుర్తించిన ప్రాంతాలు మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ/ఆర్థిక జిల్లా, రాయదుర్గం, కొండాపూర్, తెల్లాపూర్, బహదూర్‌పల్లి, జవహర్‌నగర్, ఉప్పల్, పోచారం, హార్డ్‌వేర్ పార్కు, ఏపీఐఐసీ వర్క్ సెంటర్, ఫ్యాబ్ సిటీ, మహేశ్వరం సాక్షి, హైదరాబాద్: ‘సమాచార సాంకేతిక పరిజ్ఞాన పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్)’ ప్రాజెక్టు కింద హైదరాబాద్ నగరం చుట్టూ 14 ఐటీ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు నగరం చుట్టూ అనువైన ప్రాంతాలను గుర్తించింది. మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ/ఆర్థిక జిల్లా, రాయదుర్గం, కొండాపూర్, తెల్లాపూర్, బహదూర్‌పల్లి, జవహర్‌నగర్, ఉప్పల్, పోచారం, హార్డ్‌వేర్ పార్కు, ఏపీఐఐసీ వర్క్ సెంటర్, ఫ్యాబ్ సిటీ, మహేశ్వరం ప్రాంతాలు అందులో ఉన్నాయి. 49,913 ఎకరాల (202 చదరపు కిలోమీటర్ల) విస్తీర్ణంలో తలపెట్టిన ఐటీఐఆర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే... సైబరాబాద్ పరిధితో పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో ఐటీ విప్లవం రానుంది. ఐటీఐఆర్ ప్రాజెక్టు అవసరాల కోసం ఈ రెండు ప్రాంతాల నుంచే 82 శాతం స్థలాన్ని ప్రభుత్వం సేకరించనుంది. ఐటీఐఆర్ ప్రాజెక్టుకోసం ప్రతిపాదించిన 202 చదరపు కిలోమీటర్లలోని 41 శాతం (82.4 చ.కి.మీ.) ప్రాంతాన్ని ప్రాసెసింగ్ ఏరియా కోసం కేటాయించనున్నారు. అంటే ఈ ప్రాంతాల్లోనే ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, వాటి కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఇలా ప్రాసెసింగ్ ఏరియాలో... 5.5 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందిన గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో ఉండగా... మిగతాది అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు పరిధిలో మిగతా 59 శాతం ప్రాంతాన్ని ఐటీఐఆర్ పరిశ్రమల ఉద్యోగుల వసతికి కేటాయించనున్నారు. దీనికి నాన్ ప్రాసెసింగ్ ఏరియాగా పేరుపెట్టారు. సంక్షిప్త కార్యాచరణ నివేదికలో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం ప్రణాళికను హెచ్ఎండీఏ రూపొందించనుంది. ప్రాజెక్టు వెలుపల వసతులకు కేంద్ర సాయం ఐటీఐఆర్ ప్రాజెక్టు వెలుపల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేస్తుంది. తొలి విడతగా వచ్చే ఐదేళ్లలో రూ.942 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ మొత్తంతో 2015 చివరికి ఉమ్దానగర్ నుంచి విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ లైను ఏర్పాటు, ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయం వరకు డబ్లింగ్. నానల్‌నగర్ కూడలి-హెచ్‌సీయూ డిపో, పంజాగుట్ట-ఎడులనాగులపల్లి, మూసాపేట-బీహెచ్ఈఎల్ కూడలి, హెచ్‌సీయూ డిపో-వట్టినాగులపల్లి వరకు ఔటర్ రింగు రోడ్డును విస్తరించనున్నారు. అలాగే, గోల్కొండ, రాయదుర్గం, మణికొండ, మహేశ్వరంలలో భారీ సబ్ స్టేషన్లు నిర్మించనున్నారు. అంతర్గత వసతుల బాధ్యత రాష్ట్రానిదే.. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు అంతర్గత మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వమే కల్పించనుంది. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులతో పాటు ప్రాజెక్టు ప్రాంతంలో వసూలు చేసిన ఆస్తి పన్నులు, భూ వినియోగ మార్పిడి, లే అవుట్ల క్రమబద్ధీకరణ, ప్రాసెసింగ్ ఏరియాలోని భూముల లీజులు, విక్రయాలు తదితర మార్గాల్లో నిధులను సమకూర్చనుంది. రానున్న 25 ఏళ్లలో ఐటీఐఆర్ కోసం రాష్ట్రం రూ. 13,093 కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది. అంతర్గత వనరుల కల్పనకు కావాల్సిన నిధులు (రూ. కోట్లలో) రహదారుల నిర్మాణం 2,320 డ్రైనేజీలు 1,084 ఘన వ్యర్థాల నిర్వహణ 105 విద్యుదీకరణ 2,111 టెలికాం నెట్వర్క్ 145 వర్షపు నీటి సంరక్షణ 156 భూ అభివృద్ధి వ్యయం 817 మొత్తం 13,093 ప్రాజెక్టు కోసం గుర్తించిన ప్రాంతాలు స్థలం (చ. కి.మీ.ల్లో) సైబరాబాద్ 86.7 శంషాబాద్ విమానాశ్రయం 79.2 ఉప్పల్, పోచారం 10.3 ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్-1 11.5 ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్-2 14.3 మొత్తం 202 -
సింగపూర్.. అమెరికా సరసన నిలిచింది!
హైదరాబాద్:అయిదురోజుల సింగపూర్ పర్యటనను ముగించుకుని ఆదివారం నగరానికి చేరుకున్న కేసీఆర్ ఆ దేశంపై ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం సింగపూర్ పర్యటనకు సంబంధించిన పలు అంశాలను మీడియాతో పంచుకున్న ఆయన.. ఆ పర్యటన అద్భుత అనుభూతిని కలిగించిందన్నారు. ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని ఎలా అభివృద్ధి చెందాలో చెప్పిన దేశం సింగపూర్ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మంచి నీళ్లు కూడా సింగపూర్.. ఇవాళ ఆర్థిక ప్రగతిలో అమెరికా సరసన నిలిచిందన్నారు. సింగపూర్ అభివృద్ధి మంత్రం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇవాళ అమెరికా సరసన ఆ దేశం నిలిచిదంటే అక్కడి ప్రభుత్వాలు అనుసరించిన ముందుచూపే ప్రధాన కారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతామని సింగపూర్ లో పలువురు పారిశ్రామివేత్తలు హామీ ఇచ్చారని కేసీఆర్ తెలిపారు. తాను సింగపూర్ లో చేసిన అధ్యయనం తెలంగాణ పునర్ నిర్మాణానికి ఉపయోగపడుతుందన్నారు. -
హైదరాబాద్‌కు తిరిగొచ్చిన కేసీఆర్
-
హైదరాబాద్‌కు తిరిగొచ్చిన కేసీఆర్
* రెండు దేశాల్లో ఐదురోజులు పర్యటించిన సీఎం బృందం * చివరి రోజు మలేసియా ప్రధానితో సమావేశం * మోనో రైలు, పుత్రజయ, సైబర్ జయ సందర్శన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో సింగపూర్, మలేసియాల్లో అయిదురోజుల పాటు పర్యటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బృందం తమ పర్యటనను ముగించుకొని ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. సీఎం బృందం అక్కడి పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో పాటు, ఆయా దేశాల నగరీకరణ, ఐటీ రంగాలతోపాటు పారిశ్రామిక పురోగతిపై అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ మలేసియాలో రెండురోజులపాటు జరిగిన పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్‌తో సమావేశయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తీసుకుని రానున్నట్లు వివరించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి తీసుకుంటున్న చర్యలను, పారిశ్రామిక వేత్తలకు అన్ని రకాల అనుమతులను సింగిల్‌విండో పద్ధతిలో ఇవ్వనున్నట్లు తెలిపారు. మలేషియా పర్యటనలో భాగం గా ప్రముఖ కేంద్రం పుత్రజయను, ఆ తరువాత సైబర్ జయను కేసీఆర్ సందర్శించారు. కౌలాలంపూర్‌లోని మోనోరైలును కూడా పరిశీలించారు. సంబంధిత అధికారులతో భేటీ అయ్యూరు. తొలుత సీఎం ఈ నెల 20న ప్రముఖ పారిశ్రామిక కేంద్రం జురాంగా ఇండస్ట్రీయల్ పార్క్‌ను సందర్శించాక, ఆ రాత్రి అక్కడున్న తెలంగాణ వారితో సమావేశమయ్యారు. రెండో రోజున సింగపూర్ పట్టణాభివృద్ధికి సంబంధించి అక్కడి అధికారులతో భేటీ అయ్యూరు. అక్కడి ప్రభుత్వం శాంతిభద్రతలతోపాటు, అనుసరిస్తున్న విధానాలను అక్కడి ముఖ్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆరోజు ఉదయమే స్థానికంగా ఉన్న ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం ఎలా ఉంటుందో వివరించారు. మూడో రోజున ఐఐఎం పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సదస్సుల్లో పాల్గొన్నారు. ఆ దేశ ప్రధానిని కలిశారు. ఆ దేశ మంత్రులతో కూడా పలు అంశాలపై చర్చలు నిర్వహించారు. 23వ తేదీన సీఎం బృందం కారులో సింగపూర్ నుంచి మలేసియా వెళ్లారు. సింగపూర్ నుంచి కౌలాలంపూర్ వెళ్లే సమయంలో పలు పట్టణాల్లో ఆ దేశం పట్టణాభివృద్దికి ఇచ్చిన ప్రాధాన్యతను గమనించారు. 24వ తేదీన ఆదివారం ఆయన చాలా బీజీగా గడిపారు. ఆదివారం రాత్రి అక్కడ నుంచి బయల్దేరి అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. సీఎంతో పాటు ,ఆర్థిక శాఖ వుంత్రి ఈటెల రాజేందర్, కొంతవుంది ఎమ్మెల్యేలు, అధికారులు పర్యటనలో పాల్గొన్నారు. -
హెల్త్‌కేర్, ఐటీ హవా
స్వల్ప లాభాలతో సరి రెండు రోజుల నష్టాలకు చెక్ హెల్త్‌కేర్, ఐటీ రంగాలు 2.5% చొప్పున పుంజుకోవడంతో మార్కెట్లు లాభపడ్డాయి. రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ చెబుతూ సెన్సెక్స్ 37 పాయింట్లు పెరిగి 25,100 వద్ద ముగిసింది. తొలుత గరిష్టంగా 25,210కు చేరినప్పటికీ, ఒక దశలో అమ్మకాలు పెరిగి కనిష్టంగా 25,033ను సైతం చవిచూసింది. చివరికి స్వల్ప లాభాలను కూడగట్టుకుంది. ఇక నిఫ్టీ కూడా లాభనష్టాల మధ్య ఊగిసలాడి, చివరికి 16 పాయింట్లు అధికంగా 7,509 వద్ద స్థిరపడింది. ప్రధానంగా హెల్త్‌కేర్ దిగ్గజాలు దివీస్ ల్యాబ్, ర్యాన్‌బాక్సీ, సన్ ఫార్మా, ఇప్కా ల్యాబ్, క్యాడిలా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, లుపిన్ 6-2% మధ్య జంప్ చేశాయి. ఈ బాటలో ఐటీ దిగ్గజాలు టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, కేపీఐటీ కమిన్స్, ఒరాకిల్, విప్రో, ఇన్ఫోసిస్ 4-1% మధ్య పురోగమించాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు రానున్న బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు, అంతర్జాతీయ ఆందోళనలు కూడా సెంటిమెంట్‌ను బలహీనపరచాయని చెప్పారు. కాగా, గురువారం రూ. 602 కోట్ల విలువైన షేర్లను విక్రయించని విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) తాజాగా రూ. 182 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్ మాత్రం రూ. 172 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగడంతో ట్రేడైన షేర్లలో 1,715 లాభపడితే, 1,281 నష్టపోయాయి. -
ఐటీ రంగానికి ఐదు కోట్ల మంది అవసరం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రపంచ వ్యాప్తంగా 2022 నాటికి 50 కోట్ల మంది నైపుణ్య సిబ్బంది అవసరమవుతారని, ఒక్క ఐటీ రంగానికే అయిదు కోట్ల మంది కావాల్సి వస్తుందని నాస్కామ్ ఉపాధ్యక్షుడు కేఎస్. విశ్వనాథన్ తెలిపారు. సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శనివారం ఆయన 2013-14 సంవత్సరానికి విద్యా కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. దేశంలో అయిదు వేల ఐటీ కంపెనీలున్నాయని, గ్లోబల్ ఐటీ ఎగుమతుల్లో వీటి వాటా 52 శాతమని వెల్లడించారు. చదివే రోజుల్లోనే నైపుణ్యం, సామర్థ్యాన్ని సంతరించుకోవాలని ఇంజనీరింగ్ విద్యార్థులకు సూచించారు. బహుళ జాతి కంపెనీలు సవాళ్లను ఎదుర్కోడానికి, జ్ఞాన సముపార్జనకు సిద్ధం గా ఉన్న అభ్యర్థుల కోసం అన్వేషిస్తూ ఉంటాయని తెలి పారు. నాయకత్వ లక్షణాలను అలవరచుకున్న వారికి మా త్రమే పరిశ్రమలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇదే సందర్భంలో ఆయన ఆటోమొబైల్, నిర్మాణ, ఐటీ రంగాల్లో ఉన్న అవకాశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ విద్యా సంస్థల చైర్మన్ కేసీ. రామమూర్తి, సీఎంఆర్జేటీ అధ్యక్షురాలు డాక్టర్ సబితా రామమూర్తి, వోల్వో ఉపాధ్యక్షుడు సతీశ్ రాజ్ కుమార్ ప్రభృతులు పాల్గొన్నారు.