సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రపంచ వ్యాప్తంగా 2022 నాటికి 50 కోట్ల మంది నైపుణ్య సిబ్బంది అవసరమవుతారని, ఒక్క ఐటీ రంగానికే అయిదు కోట్ల మంది కావాల్సి వస్తుందని నాస్కామ్ ఉపాధ్యక్షుడు కేఎస్. విశ్వనాథన్ తెలిపారు. సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శనివారం ఆయన 2013-14 సంవత్సరానికి విద్యా కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు.
దేశంలో అయిదు వేల ఐటీ కంపెనీలున్నాయని, గ్లోబల్ ఐటీ ఎగుమతుల్లో వీటి వాటా 52 శాతమని వెల్లడించారు. చదివే రోజుల్లోనే నైపుణ్యం, సామర్థ్యాన్ని సంతరించుకోవాలని ఇంజనీరింగ్ విద్యార్థులకు సూచించారు. బహుళ జాతి కంపెనీలు సవాళ్లను ఎదుర్కోడానికి, జ్ఞాన సముపార్జనకు సిద్ధం గా ఉన్న అభ్యర్థుల కోసం అన్వేషిస్తూ ఉంటాయని తెలి పారు.
నాయకత్వ లక్షణాలను అలవరచుకున్న వారికి మా త్రమే పరిశ్రమలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇదే సందర్భంలో ఆయన ఆటోమొబైల్, నిర్మాణ, ఐటీ రంగాల్లో ఉన్న అవకాశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ విద్యా సంస్థల చైర్మన్ కేసీ. రామమూర్తి, సీఎంఆర్‌జేటీ అధ్యక్షురాలు డాక్టర్ సబితా రామమూర్తి, వోల్వో ఉపాధ్యక్షుడు సతీశ్ రాజ్ కుమార్ ప్రభృతులు పాల్గొన్నారు.
ఐటీ రంగానికి ఐదు కోట్ల మంది అవసరం
Published Sun, Aug 11 2013 3:08 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement