'ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ' | KCR again Promises Waiver of Crop Loans | Sakshi
Sakshi News home page

'ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ'

Published Fri, Jun 13 2014 1:02 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

'ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ' - Sakshi

'ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ'

హైదరాబాద్ : రైతులకు ఎటువంటి ఆంక్షలు లేని పంట రుణ మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బంగారం పెట్టి తెచ్చుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని ఆయన శుక్రవారం సభలో ప్రకటించారు. ఈ రుణమాఫీ ద్వారా ప్రభుత్వంపై 19వేల కోట్ల రూపాయలు భారం పడినా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని కేసీఆర్ శాసనసభ సాక్షిగా ప్రకటించారు.

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ..రుణమాఫీ ద్వారా 26 లక్షల రైతు కుటుంబాలకు  మేలు జరుగుతుందని చెప్పారు. సబ్సిడీ విత్తనాల కోసం రైతులు ముందస్తుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement