హరీష్ రావుకు విద్యుత్ శాఖ! | KCR concentrate on power crisis in telangana | Sakshi
Sakshi News home page

హరీష్ రావుకు విద్యుత్ శాఖ!

Published Mon, Oct 13 2014 10:37 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

KCR concentrate on power crisis in telangana

హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై దృష్టి పెట్టారు. తాజా పరిస్థితిపై ఆయన నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. నీటిపారుదల శాఖ  మంత్రి హరీష్ రావుకు అదనంగా విద్యుత్ శాఖను అప్పగించాలని యోచన ఉన్నట్లు సమాచారం. విద్యుత్ శాఖను కొత్తవారికి అప్పగించేకన్నా, ఇప్పటికే ఈ శాఖపై అవగాహన ఉన్న హరీష్ రావుకే బాధ్యతలు ఇవ్వాలని ఈ మేరకు పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

విద్యుత్ శాఖకు ఇప్పటివరకూ మంత్రిని కేటాయించకపోవటంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. విద్యుత్ కొరతతో అధిగమించే విషయంతో పాటు, విపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు కేసీఆర్ ఈ మేరకు రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇదే అంశంపై సోమవారం మధ్యాహ్నం కేసీఆర్, మంత్రులు, ముఖ్య నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement