తెలంగాణ కేబినెట్లోకి ఆరుగురికి ఛాన్స్! | kcr expand cabinet , Tummala, jupalli, koppula eswar likely to get berth | Sakshi
Sakshi News home page

తెలంగాణ కేబినెట్లోకి ఆరుగురికి ఛాన్స్!

Published Sat, Dec 13 2014 5:07 PM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

తెలంగాణ కేబినెట్లోకి ఆరుగురికి ఛాన్స్! - Sakshi

తెలంగాణ కేబినెట్లోకి ఆరుగురికి ఛాన్స్!

హైదరాబాద్ :  తెలంగాణ మంత్రివర్గంలో ఆరుగురికి చోటు దక్కినట్లు సమాచారం.  మంత్రివర్గ విస్తరణను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. రాజ్భవన్లో శనివారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయిన ఆయన... మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం.  తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటివరకూ కేసీఆర్ తో పాటు 12మంది ఉన్నారు. కాగా నిబంధనల ప్రకారం తెలంగాణ కేబినెట్ లో 18మంది వరకూ ఉండవచ్చు.

మంత్రివర్గంలో తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి, కొండా సురేఖ, చందూలాల్, జూపల్లి కృష్ణారావు పేర్లు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. మరొకరి కూర్పుపై  కసరత్తు చురుగ్గా సాగుతోంది. కాగా ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రివర్గంలో ఛాన్సు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పదవులు రానివారికి చీఫ్ విప్, విప్ పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం.  చీఫ్ విప్గా కొప్పుల ఈశ్వర్, విప్లుగా నల్లాల ఓదేలు, సునీతా మహేందర్ రెడ్డి, గంపా గోవర్థన్ పేర్లు పరిశీలించినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement