- జిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు చవటలు, దద్దమ్మలు
- ప్రజాసమస్యల్ని పరిష్కరించలేక మహిళల పై విమర్శలు
- టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ఫైర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లా మంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చవటలు, దద్దమ్మలని మాజీ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి మహేందర్‌రెడ్డికి ఎలాంటి అధికారమూ లేదని, కేవలం బొమ్మమంత్రి మాత్రమేనని విమర్శించారు. పదవి కోసం ఆయన ఎలాంటి పనులైనా చేస్తారని, పదవిని కోల్పోయిన మరుసటి రోజు టీఆర్‌ఎస్‌లో ఉండడని, సీఎం కుటుంబ సభ్యుల బూట్లు తుడుస్తూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం గాంధీభవన్‌లో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, పార్టీ నేత కార్తీక్‌రెడ్డిలతో కలిసి మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలపై మాజీ హోం మంత్రి సబిత ప్రశ్నలకు మంత్రి మహేందర్‌రెడ్డి వద్ద సమాధానాలు లేవన్నారు.
మంత్రిగా కనీస అవగాహన లేకపోవడంతో ఏంచేయాలో పాలుపోక ఆమెపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ధైర్యం ఉంటే మంత్రి ఆరోపణలపై విచారణ చేయాలని, దోషిగా తేలితే శిక్షకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. అనవసర ఆరోపణలు చేస్తే మంత్రి ఇల్లు ముట్టడించి ఆందోళన చేపడతామన్నారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా జిల్లా రైతులకు నీళ్లు అందుతాయా, లేదా అనే ప్రశ్నకు కేసీఆర్‌తో సమాధానం చెప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఖజానాను నింపడంలో కీలకమైన రంగారెడ్డి జిల్లాపై సీఎం కేసీఆర్ కక్ష సాధిస్తున్నారని, నీళ్లేలేని జిల్లాలో ప్రాజెక్టులు కట్టకుండా రైతాంగా న్ని నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైలు బండిలో ఇంజిన్ కీలకమైందని, రాష్ట్రంలో జిల్లా కూడా ఇంజిన్ పాత్ర పోషిస్తోందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
పదేళ్ల కాలంలో జిల్లాకు ప్రాణహిత- చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాలను తీసుకొస్తే.. కేసీఆర్ వాటి రూపు మార్చి జిల్లాకు అన్యాయం చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళా వ్యతిరే కి అని, అందువల్లే రాష్ట్ర కేబినెట్‌లో మహిళలకు చోటులేదన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు అతిత్వరలోనే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చేవెళ్ల పార్లమెంటు నాయకులు పి.కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై ఎదిరిం చే వారిపై దాడులు చేయడం టీఆర్‌ఎస్ నైజమన్నారు. అభివృద్ధిపై మహేందర్‌రెడ్డి సవాల్‌కు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, సమయం, స్థలం చెబితే తామంతా హాజరవుతామన్నారు.
కేసీఆర్ బూట్లు తుడుస్తున్నారు..
Published Fri, Sep 11 2015 3:15 AM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM
Advertisement
Advertisement