కేసీఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 9.20 గంటలకు సురేంద్రపురికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన యాదగిరిగుట్టకు చేరుకున్నారు.
గర్భాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్నికేసీఆర్ ఆవిష్కరించారు. అక్కడి సుదర్శన చక్రం పక్కన ఏర్పాటు చేసిన మరో శిలాఫలాకానికి గవర్నర్ నరసింహన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు త్రిదండి చినజీయర్ స్వామి కూడా పాల్గొన్నారు. అంతకు ముందు కేసీఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
కాగా కేసీఆర్ యాదగిరిగుట్ట పర్యటన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్‌లో గజ్వేల్ నియోజకవర్గం ములుగుకు చేరుకుంటారు. అక్కడి పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ కప్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్‌కు పయనం అవుతారు.