కేసీఆర్ ఫొటో మార్ఫింగ్ దారుణం | KCR photo morphing atrocity | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ఫొటో మార్ఫింగ్ దారుణం

Published Sat, Sep 13 2014 12:22 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

కేసీఆర్ ఫొటో మార్ఫింగ్ దారుణం - Sakshi

కేసీఆర్ ఫొటో మార్ఫింగ్ దారుణం

  •   బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
  •    పోలీసులకు ఫిర్యాదు చేసిన  కేసీఆర్ అభిమాన సంఘం నేతలు
  • నాగోలు: తెలుగుదేశం పార్టీ ఫేస్‌బుక్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హిట్లర్‌లా ఫొటో మార్ఫింగ్ చేసి అవమాన పరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేసీఆర్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధరణిధర్ కులకర్ణి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ముక్తవరం సుశీలారెడ్డి శుక్రవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎంతగానో అభిమానించే సీఎం కేసీఆర్‌ను ఈ రకంగా అవమానించడం తగదన్నారు. ఫొటోను మార్ఫింగ్ చేయడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. ఎన్నికల కమిషన్ గుర్తింపు ఉండి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన టీడీపీ కార్యాలయ వర్గాలు సీఎం కేసీఆర్ పట్ల చులకన భావంతో వ్యవహరించడాన్ని వారు ఖండించారు. ఫిర్యాదు చేసిన వారిలో సంఘం సంయుక్త కార్యదర్శి సీహెచ్ బాలరాజు, నాయకులు కిరణ్, దేవేందర్‌రెడ్డి, శ్రీధన్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement