సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్‌ | KCR plans to go to the Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్‌

Published Thu, Mar 16 2017 7:35 PM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్‌ - Sakshi

సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్‌

హైదరాబాద్‌: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లనుంది. హైకోర్టు తీర్పు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వెలువడిన నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం పార్లమెంట్‌ సమావేశాల్లో ఉన్న ఎంపీ కవిత హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు.

కవిత సింగరేణి అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వారు హైకోర్టు తీర్పుపై చర్చించారు. సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను న్యాయస్థానం గురువారం రద్దు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement