మేనిఫెస్టోకు విరుద్ధంగా కేసీఆర్ పాలన
నర్సంపేట టౌన్ : టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికలకు ముందు విడుద ల చేసిన మేనిఫెస్టోకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నాడని టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పులివూమిడి వుద్దిలేటి విమర్శించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోవువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాకవుుందు కేసీఆర్ ఆదివాసీలకు అండగా నిలుస్తానని హామీలిచ్చి అధికారంలోకి రాగానే వారికి ద్రోహం చేస్తున్నాడని విమర్శించారు. 1/70, ఫీసా చట్టాలను ఉల్లంఘించి 3 లక్షల వుంది ఆదివాసీల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడని అన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ, సీవూంధ్ర దోపిడీ పాలకవర్గ ప్రతినిధులైన చంద్రబాబు, వెంకయ్యునాయుుడు ఏకమై ఆదివాసీలకు వురణశాసనాన్ని లిఖించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీలలో తిష్టవేసిన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ లాంటి పార్టీలన్నీ కలిసి చేసిన కుట్ర ఫలితంగానే అరుదైన ఆదివాసీ జాతి అంతరించి పోతున్నదని మండిపడ్డారు. పోలవరం రద్దుకు ఆదివాసీలకు అండగా నిలవడానికి ప్రతి ఒక్కరూ ఉద్యవూలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చా రు. సవూవేశంలో నాయకులు జనగాం కువూరస్వామి, వుల్లెల సాంబయ్యు, పోరిక ఉదయ్‌సింగ్, నూకాల కృష్ణవుూర్తి, యుశబోరుున కొమురయ్యు, కొంగ వుురళి, ఎండీ.సంధాని, గువ్ముడి లక్ష్మీనారాయుణ, కృష్ణవుూర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.