సాక్షి, హైదరాబాద్ : గడిచిన ఐదేళ్లలో ఎన్నో అవరోధాలను అధిగమించామని, ఎన్నో విజయాలు సాధించామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణపై జోకులు వేసిన వారు అవాక్కవుతున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం పబ్లిక్ గార్డన్స్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం గడుతున్నారని అన్నారు. తెలంగాణ బలమైన ఆర్ధిక శక్తిగా మారిందని, కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నామని చెప్పారు.
మంచినీటి సమస్య తీర్చుకున్నామని, మిషన్ భగీరథ ప్రజల బాధలను తీర్చిందని తెలిపారు. మిషన్ భగీరథ పనులు 97 శాతం పూర్తి అయ్యాయన్నారు. పేదలకు కనీస భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వృధ్యాప్య పింఛన్ రూ. 2016కి పెంచామని, వికలాంగులకు పింఛన్ రూ.3016కి పెంచుతున్నట్లు తెలిపారు. పెంచిన ఆసరా ఫించన్లు జులై ఒకటో తేదీన అందుతాయని వెల్లడించారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు పురోగతి సాధించాయన్నారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. కంటి వెలుగు పథకం చాలా మందికి వెలుగునిచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment