సీఎం హోదాలో తొలిసారి ఢిల్లీకి కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి హస్తినకు పయనం అవుతున్నారు. కేసీఆర్ శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో భేటీ అవుతారు. పోలవరం ప్రాజెక్ట్ ఆర్డినెన్స్పై కేసీఆర్ రాష్ట్రపతితో చర్చించనున్నారు.
అలాగే పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలని ప్రధానిని కోరే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించినట్లే తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా కల్పించాలని కేసీఆర్ కోరనున్నారు. మరోవైపు కేంద్రంతో సఖ్యత కుదుర్చుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే సన్నాహాలు చేశారు. బీజేపీ నేతలతో పరిచయాలు ఉన్న టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డిని లోక్సభాపక్ష నేతగా ఆయన నియమించారు.