భద్రాద్రి రామునికి ముత్యాల తలంబ్రాలు
ఖమ్మం: శ్రీరాముడు కొలువైన భద్రాచలంలో నేడు శ్రీరామనవమి కళ్యాణోత్సవం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్వామి వారిని దర్శించుకొని ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అంతేకాకుండా శ్రీరాముని పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరుకానుండటం విశేషం.