రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్
భద్రాచలం: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందచేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్లో భద్రాచలం చేరుకున్నారు. శ్రీరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన కేసీఆర్కు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
కాగా కేసీఆర్ కుటుంబసభ్యులు గతరాత్రే భద్రాచలం చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి జరుగుతున్న రాములోరి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. మరోవైపు భద్రాచలం భక్తజన సందోహం అయింది. శ్రీరామనామ స్మరణతో మార్మోగిపోతుంది.