'కేసీఆర్ చాలా బిజీ.. కరెంటు గురించి అడగలేదు'
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా బిజీగా ఉంటున్నారని, ఆయన అసలు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత గురించి తమను సంప్రదించనే లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు త్వరలోనే 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో కూడా విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు గోయల్ చెప్పారు. థర్మల్ విద్యుత్ ఉత్పాదనను తాము 15 శాతం పెంచామని, బొగ్గుగనుల కేటాయింపు రద్దు చేసినంత మాత్రాన థర్మల్ విద్యుత్ ఉత్పాదనకు వచ్చిన నష్టమేమీ లేదని ఆయన అన్నారు. విద్యుత్ విషయంలో తాము రాజకీయాలు చేసే ప్రసక్తి లేదని పియూష్ గోయల్ స్పష్టం చేశారు.