
'పర్యావరణానికి హానీ కలిగించొద్దు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ఎదురైన విఘ్నాలన్నీ తొలగి తెలంగాణ అవతరించిన తర్వాత జరుపుకుంటున్న వినాయక చవితికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. అభివృద్ధికి విఘ్నాలన్నీ తొలగి మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలు ఘనంగా, ఆనందంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హానీ కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలని ప్రజలను కేసీఆర్ కోరారు.