హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువులకు పర్యాటక హంగులు అద్దేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మాస్టర్‌ప్లాన్‌లు రూపొందించింది. ఈ రెండు చెరువులను దశలవారీగా సుందరీకరించాలని నిర్ణయించింది. అలాగే వందేళ్లు పూర్తి చేసుకుంటున్న గండిపేట జలాశయం సుందరీకరణపై కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) కార్యాలయంలో హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్, ఇంజనీరింగ్ విభాగాధిపతి బీఎల్‌ఎన్ రెడ్డి, ఇతర విభాగాధికారులతో మంత్రి కేటీఆర్ గురువారం ఆయా ప్రాజెక్టులపై సమీక్షించారు. వాటికి సంబంధించిన, అనుసరించాల్సిన విధానాలపై సూచనలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment