తాండూరు (రంగారెడ్డి జిల్లా): ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగినందున వేతన సవరణ చేయాలన్నారు. ఉద్యోగాలను పణంగా పెట్టి సమ్మె చేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు వారికి జేఏసీ అండగా నిలుస్తుందని తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తాండూరు ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నాలో ఆయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం మొండివైఖరి మానుకోవాలని సూచించారు. ఆర్టీసీ ఎండీ నిరంకుశంగా వ్యవహరించడాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు కోరడం లేదని, ఆర్టీసీ ఉద్యోగులకు సమానంగా జీతాలు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారని వివరించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు రవీందర్‌రావు, పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
'సమ్మెపై సర్కారు జోక్యం చేసుకోవాలి'
Published Sun, May 10 2015 7:15 PM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM
Advertisement