ఎర్రుపాలెంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న కొండపల్లి శ్రీధర్, ఎంపీ అభ్యర్థి వాసుదేవరావు
సాక్షి, ఎర్రుపాలెం: ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనే దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి దేవకి వాసుదేవరావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రింగ్ సెంటర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత గ్రామంలోని గాంధీసెంటర్ నుంచి రింగ్ వరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలకు మోదీ ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందన్నారు.
దేశానికి ముప్పు పొంచి ఉన్న తరుణంలో ప్రధానిగా మోదీ చూపిన చొరవను యావత్తు దేశం మెచ్చుకుంటోందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయప్రతాప్, మండల కమిటీ అధ్యక్షుడు ముక్కపాటి శ్రీనివాసరావు, నాయకులు పింగళి శ్రీనివాసరావు, దనిశెట్టి పెద్ద వెంకటేశ్వరరావు, ఇత్తడి కృష్ణ, నండ్రు పుల్లారావు, తదితరులున్నారు.
మధిరరూరల్: భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని బీజెపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి వాసుదేవరావు అన్నారు. మధిర పట్టణంలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
స్థానిక అంబేడ్కర్ సెంటర్ నుంచి రాయపట్నం సెంటర్, మెయిన్‌రోడ్డు, రైల్వే గేటు మీదుగా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన ఘనత నరేంద్రమోదీకే దక్కుతుందన్నారు. సుపరిపాలన, అవినీతిలేని భారత్‌కోసం ప్రతిఒక్కరూ బీజేపీకి మద్దతు ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, చిలివేరు సాంబశివరావు, పాపట్ల రమేష్, బాడిశ అర్జునరావు, స్వర్ణాకర్, రామిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment