ఆనాడు ప్రశ్నించింది కేసీఆర్ నోరే కదా!
సాక్షి, నిజామాబాద్: రాష్ట్రంలో నిజాం పాలన నడుస్తోందని, సీఎం కేసీఆర్ ఎనిమిదో నిజాం మారిదిగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు. హోంగార్డుల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి దిగిన బీజేపీ నేత కిషన్‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. కిషన్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు.
చరిత్రను వక్ర్రీకరిస్తే చరిత్ర హీనులవుతారు... కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలంటూ ఆనాడు రోశయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కేసీఆర్ నోరే కదా అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కోసం తెచ్చుకోలేదా అని అడిగారు. 'ఆత్మ గౌరవం అంటే ఓట్లు కాదు. ముస్లింలు కూడా వ్యతిరేకించడం లేదు. మైనారిటీ ఓటు బ్యాంకుకు నష్టం జరుగుతుందన్న భయంతో టీఆర్ఎస్ అధికారికంగా సెప్టెంబర్ 17 ను జరపడం లేద'ని ఆరోపించారు.