కేసీఆర్‌ ఎనిమిదో నిజాం | KCR is the eighth Nizam krishna sagar rao | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఎనిమిదో నిజాం

Published Sun, Sep 17 2017 3:24 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

కేసీఆర్‌ ఎనిమిదో నిజాం - Sakshi

కేసీఆర్‌ ఎనిమిదో నిజాం

బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు
 
సుభాష్‌నగర్‌ (నిజామాబాద్‌ అర్బన్‌): సీఎం కేసీఆర్‌ ఎనిమిదో నిజాంలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో పాలన నిజాం నిరంకుశ పాలనను తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగర్‌రావు విమర్శించారు. శనివారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.

నేడు తెలంగాణకు 70వ స్వాతంత్య్ర దినోత్సవం అని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అరెస్ట్‌ అప్రజాస్వామికమన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడాన్ని ముస్లింలు కూడా వ్యతిరేకించడం లేదని, మైనార్టీల ఓటు బ్యాంకు కోల్పోతామనే భయంతో టీఆర్‌ఎస్‌ అధికారికంగా నిర్వహించడంలేదని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర మీడియా కన్వీనర్‌ రాంరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement