'విద్యుత్ సంక్షోభానికి కారణం ఆ రెండు పార్టీలే'
హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలకు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ 22 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణం ముమ్మాటికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని అందులో పేర్కొన్నారు. మొన్నటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా పాలించిన ఈ రెండు పార్టీలు ప్రస్తుతం విద్యుత్ సంక్షోభంపై దుష్ప్రచారం చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.
విద్యుత్ సంక్షోభంపై కాంగ్రెస్, టీడీపీ మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన విద్యుత్ వాటాపై కాంగ్రెస్, టీడీపీలు ఎందుకు ప్రశ్నించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.