స్టేషన్‌ఘన్‌పూర్ : వడదెబ్బకు ముసలివాళ్లే కాదు యువకులు కూడా రాలిపోతున్నారు. తాజాగా వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవ్‌పూర్ గ్రామంలో మంగళవారం కాసాని శ్రీరాములు అనే 30 ఏళ్ల వ్యక్తి వడదెబ్బకు చనిపోయాడు. గ్రామంలో ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లిన అతను అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది.