టీడీపీ శకం ముగిసింది | Lee era ended | Sakshi
Sakshi News home page

టీడీపీ శకం ముగిసింది

Published Fri, Mar 14 2014 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

Lee era ended

నాగర్‌కర్నూల్,   ప్రజల పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని, సీమాంధ్రుల కల్లబొల్లి మాటలు, అవకాశవాదంతో బిల్లుకు సహకరించిన పార్టీలకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథం పిలుపునిచ్చారు. గురువారం స్థానిక టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణ, తుంగభద్ర నీటి లభ్యతను బట్టి జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామన్నారు.

తెలంగాణలో టీడీపీ శ కం ముగిసిందని, కేసీఆర్‌ను విమర్శిస్తూ తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ కోసం ఒక్కరోజు కూడా జెండా పట్టనివారు, సమైక్యాంధ్ర ఫ్లెక్సీలు పట్టుకున్నవారు సంబరాలు చేసుకోవడంలో అర్థం లేదన్నారు. నాగర్‌కర్నూల్ పట్టణంలో ఎంపీగా తాను ఎ న్నో అభివృద్ధి పనులు చేశానని, ఇంటింటి నల్లా పథకానికి నిధులు తెస్తే వాటిని వినియోగించుకోలేకపోయారన్నారు.

తొలుత డిజైన్ చేసిన రామన్‌పాడు పథకాన్ని పొడిగించడం వల్లే ఆ పథకం విఫలమైందన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు శరత్‌బాబు, సంధ్యారాణి, జిల్లా అధికార ప్రతినిధులు కుర్మయ్య, తిర్పతయ్య, ఖాజా, తదితరులు పాల్గొన్నారు.

 కిరణ్ చేయని దుర్మార్గాలు లేవు

 అచ్చంపేట: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయి కొత్త రాష్ట్రం అవతరించబోతుంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మూర్ఖ శికామణిలా ఇప్పటికీ తెలంగాణ ఆపుతానంటూ మాట్లాడటం సిగ్గుచేటని మందా మండిపడ్డారు. అచ్చంపేటలోని చందాపూర్‌లో ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కిరణ్ చేయని దుర్మార్గమంటూ లేద ని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3ప్రకారం అసెంబ్లీ తీర్మానం లేకుండా పార్లమెంటులో బిల్లు అమోదం చెల్లుతుందని సీఎం అయిన  వ్యక్తి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

అసెంబ్లీ తిప్పి పంపిన బిల్లు పార్లమెంటులో చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందని ఆయన అనడం అవివేకమన్నారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ తికతికగా మాట్లాడినా స్మశానం నుంచి వచ్చిన పార్టీలు స్మశానంలోనే కలిసిపోతాయని చెప్పడంలో వాస్తవం ఉందన్నారు. ఒకరోజు కూడా ఉద్యమంలో పాల్గొనని పార్టీలు ఇప్పుడు తెలంగాణ ఇచ్చిందీ, తెచ్చింది మేమంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి గువ్వల బాలరాజు, నాయకులు జి.సుదర్శన్, వంగా గిరివర్ధన్‌గౌడ్, నర్సింహ్మగౌడ్, చీమర్ల మధుసూదన్‌రెడ్డి, పుల్జాల చంద్రమోహన్, కటకం భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement