![loading workers strikes in oriental - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/24/b3.jpg.webp?itok=4DvScXN1)
లోడింగ్ కార్మికుల సమ్మెతో ఉత్పత్తి లేక బోసిపోయిన కంపని
కాసిపేట : ఏడాదిన్నరగా వారసత్వ ఉద్యోగాలను పెండింగ్‌లో ఉంచడాన్ని నిరసిస్తూ మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపనీలో లోడింగ్ కార్మికులు మంగళవారం సమ్మెకు దిగారు. కార్మిక సంఘాలతో సోమవారం తుదిచర్చలు అని చెప్పిన యాజమాన్యం ఎలాంటి కారణం లేకుండా చర్చలను నిలిపివేసింది. దీంతో ఆగ్రహించిన లోడింగ్ కార్మికులు మంగళవారం మొదటిషిప్టు నుంచి సమ్మెలోకి దిగారు. కంపనికి ప్రధానమైన డిపార్టుమెంటు లోడింగ్ కావడంతో ఎటువంటి ఉత్పత్తి బయటకు వెళ్లలేదు. ఈవిషయమై ఎప్పటి నుంచో ఆగ్రహంగా ఉన్న పర్మినెంటు కార్మికులు సైతం నేటి నుంచి సమ్మెలోకి దిగేందుకు తీర్మానించారు. నేడో, రేపో కాంట్రాక్టు కార్మికులు సైతం సమ్మెలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నడూ లేనివిధంగా అన్నివర్గాల కార్మికులు సమ్మెకు సిద్ధపడద్ధిది తొలిసారి.
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే దానిని సాకుగా చూపుతూ ఓరియంట్ డ్రామాలు ఆడుతుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయిన గిరిజనులకు న్యాయం చేయాలని, నష్టపరిహరం అందించాలని, ఉద్యోగాలు కల్ఫించాలని, రీసర్వే చేయాలని కోర్టు తీర్పులను పట్టుకోని వచ్చిన ఆదివాసీలను గెంటివేశారు. అప్పుడు కోర్టు తీర్పు అమలు గుర్తుకు రాలేదా అని, వారసత్వాలను హరిస్తే ఊరుకునేది లేదని కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment