వేసవిలో నగర ప్రజలకు సరిపడా నీరందిస్తాం
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దేవాదుల ప్రాజెక్టు సందర్శన
నదిలో నుంచి నీటి పంపింగ్‌పై దృష్టి
అంచనాలు తయూరు చేయూలని అధికారులకు ఆదేశం
ఏటూరునాగారం : గ్రేటర్ వరంగల్ ప్రజలకు ఎండాకాలంలో తాగునీటిని పూర్తి స్థాయిలో అందిస్తామని, గొంతులు ఎండకుండా చూస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ‘గ్రేటర్‌కు నీళ్లగండం’ శీర్షిక సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన డిప్యూటీ సీఎం.. శుక్రవారం గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం ఏటూరునాగారం మండలంలోని దేవాదుల ప్రాజెక్టు ఇన్‌టేక్‌వెల్‌ను, గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు తాగునీటిని అందించడానికి భద్రకాళి, వడ్డెపల్లి, ధర్మసాగర్ రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీరు కేవలం 90 రోజులకు మాత్రమే సరిపోతుందని, మూడు రోజులకోసారి ప్రజలకు నీటిని సరఫరా చేయాల్సి దుస్థితి నెలకొన్నదన్నారు. ఎల్‌ఎండీ, ఎస్సారెస్సీ ప్రాజెక్టులో నీరు తగినంత లేకపోవడంతో నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదముందని, దీని నివారణకు దేవాదుల మొదటి దశ ద్వారా నీటిని అందించాలని ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించామని కడియం చె ప్పారు. గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 68 మీటర్ల ఎత్తులో ఉందని, అరుుతే నదిలో నీటిమట్టం 71 అడుగులు ఉంటేనే దేవాదుల ఇన్‌టేక్ వెల్‌లో మొదటిదశ మోటార్లు నడుస్తాయని తెలిపారు.
అడ్డుకట్టలతో నీటి నిల్వలు
దేవాదుల వద్ద గోదావరి నీరు రెండు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రవహిస్తోందని, ఈ నీటిని వినియోగించుకోవడానికి ఇసుక బస్తాలు, మట్టికట్టలతో అడ్డుకట్టలు వేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ వీరయ్య డిప్యూటీ సీఎం కడియం కు వివరించారు. ఎన్ని మోటార్లతో ఎంత ఖర్చుతో ఎన్నిరోజుల్లో నీటిని పంపింగ్ చేయగలుగుతారని అధికారులను కడియం ప్రశ్నించారు. ఇన్‌టేక్‌వెల్‌లోకి నీరు తరలించేందుకు 200 హార్స్‌పవర్ మోటార్లను పది బిగించి గోదావరి ప్రవాహంలో అమర్చి వాటి ద్వారా ఇన్‌టేక్‌వెల్‌కు పంపింగ్ చేస్తే నగరానికి కొంత మేర నీటి ఎద్దడి తీరుతుందని అధికారులు వెల్లడించారు. ఈ మోటార్లకు డీజిల్ లేదా విద్యుత్ సమకూర్చుకోవాలని, పనులు 20 రోజుల్లో పూర్తిచేసి నీటిని పంపింగ్ చేయాలని కాంట్రాక్టు సంస్థ పవర్‌సోలేషన్ కంపెనీ ఎండీ ఉమామహేశ్వర్‌ను కడియం ఆదేశించారు. దేవాదులలోని రెండు మోటార్ల ద్వారా రోజుకు భీంఘన్‌పూర్ రిజర్వాయర్‌కు 15 మిలియన్ క్యూబిక్ ఫీట్(ఎంసీఎఫ్‌టీ) నీరు సరఫరా అవుతుందని, అక్కడి నుంచి పులుకుర్తి, తర్వాత ధర్మసాగర్ రిజర్వాయర్‌కు నీటిని అందిస్తే వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు నీటి ఎద్దడి ఉం డదని కడియం అన్నారు. దేవాదుల నీరు తరలించేందుకు ఇంజనీరింగ్ అధికారులు రూపొం దించే అంచనాలకు సీఎం కేసీఆర్ వద్ద అనుమ తి తీసుకుంటామని, పనులు సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం క్రమం లో దిగువ భాగంలో చిన్నపాటి బ్యారేజీ నిర్మి స్తే ఇప్పుడు ఇలాంటి దుస్థితి వచ్చి ఉండేది కా దని, అప్పుడు చాలా తక్కువ ఖర్చుతో బ్యారేజీ నిర్మాణం జరిగి ఉండేదని కడియం అభిప్రాయ పడ్డారు. ఈ ఏడాది వేసవిలో నీటిఎద్దడి రాకుం డా శాయశక్తులా కృషి చేస్తున్నామని, 2017 వేసవిలో ప్రజలకు నీరందించేందుకు మాస్టర్‌ప్లాన్ ఇప్పటినుంచే తయారుచేస్తున్నట్లు తెలిపారు.
తల్లి గోదావరి నీరు ఎంతో పవిత్రం
దేవాదుల వద్ద గోదావరిని పరిశీలించిన కడియం.. గోదావరి నది నీటిని తాగి.. తల్లి గోదారి నీరు ఎంతో పవిత్రమని అన్నారు. ప్రాజెక్టు సందర్శించిన వారిలో ఎస్‌ఈ వీరయ్య, ఈఈ జగదీష్, డీఈఈ రాంప్రసాద్, ఏఈఈలు శ్రీనివాస్‌రావు, విద్యాసాగర్, కార్పొరేషన్ ఎస్‌ఈ అబ్దుల్ రహమాన్ తదితరులు ఉన్నారు.
గొంతెండనివ్వం
Published Sat, Feb 13 2016 1:27 AM | Last Updated on Tue, Aug 21 2018 12:18 PM
Advertisement
Advertisement