
ఈ ఫొటోలో చూస్తున్నది ర్యాలీ కాదు.. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు గురువారం సీజ్ చేశారు. దీంతో వాహనదారులు ప్లీజ్ సార్.. క్షమించండి. ఇంకోసారి ఇలా చేయం అంటూ పోలీసులను బతిమిలాడుతూ పోలీసుస్టేషన్ వరకు నడుచుకుంటూ వెళుతుండటం ర్యాలీని తలపించింది.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్
కరోనా ఉ(అ)పాయాలు
లాక్‌డౌన్ నేపథ్యంలో కొందరు ఎలాగైనా తమ గ్రామాలను చేరుకునేందుకు మార్గాలు అన్వేషిస్తూ ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. టైర్లు తీసుకెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్‌లో వాటి మధ్య ఇలా కూర్చుని ప్రయాణిస్తున్నారు. రాజీవ్ రహదారి మీదుగా వాహనం వెళ్తుండగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీసులు వీరిని గుర్తించారు. కరోనా నేపథ్యంలో జిల్లాలు దాటి స్వగ్రామం చేరేందుకు మరో మార్గం లేక ఇలా చేయాల్సి వచ్చిందని వారు పోలీసులకు తెలిపారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
(చదవండి: బాలుడితో మంత్రి కేటీఆర్ చమత్కారం)
Comments
Please login to add a commentAdd a comment