
రహదారిపై లారీ కింద వంట చేస్తున్న ఇతర రాష్ట్రాల డ్రైవర్లు
సాక్షి, వరంగల్ : లారీల సమ్మె నేపథ్యంలో డ్రైవర్లు, క్లీనర్లు నానాఇబ్బందులు పడుతున్నారు. లారీల బంద్ ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదని వివిధ రాష్ట్రాల నుంచి డ్రైవర్లుగా వచ్చిన వారు క్లీనర్లను ఇక్కడే ఉంచి ఇంటిముఖం పడుతున్నారు. మరికొంత మంది లారీల వద్దే ఉంటూ వంట చేసుకుని తినడంతోపాటు అక్కడే పడుకుంటున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రవాణా రంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రధానంగా వరంగల్ పట్టణంలోని ఎల్‌బీనగర్, పుప్పాలగుట్ట, చింతల్, రంగశాయిపేట, ఎస్‌ఆర్‌ఆర్‌తోట. హన్మకొండలోని తదితర ప్రాంతాలతోపాటు భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలోలారీలు ఆధికంగా ఉన్నాయి.లారీల బంద్‌తో ఆయా కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది.
తిండికి అప్పులు చేస్తున్నాం...
నేను డ్రైవర్‌గా పనిచేస్తాను. ఆరు రోజులుగా లారీలు నిలిచిపోవడంతో కు టుంబ పోషణ భారంగా మారింది. తిండికి అప్పులు చేస్తున్నాం. వారం రోజులుగా ఇంటికి వెళ్లలేదు. పగలంతా రహదారులపై గడుపుతున్నాం. రాత్రి పూట ప్రయాణం చేస్తున్నాం. సరుకులతో ప్రయాణం చేయాలంటే భయమేస్తోంది.
సమ్మె ఇలాగే కొనసాగితే మేమెట్లా బతకాలి. మహేందర్, డ్రైవర్, గుజరాత్
ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
గుజరాత్ రాష్ట్రం నుంచి తమిళనాడుకు లోడుతో వెళ్తున్నా. ఇంటి నుంచి బయలు దేరి ఎనిమిది రోజు లైంది. రాత్రి పూట ప్రయాణం భారంగా మారింది. రోడ్డుపైనే వంట చేసుకుంటున్నాం. ఉదయం అంతా రెస్ట్ తీసుకుని రాత్రిపూట బయలుదేరుతున్నాం. సమ్మె విరమణ ఎప్పుడు.. మేము తమిళనాడుకు చేరుకునేది ఎప్పుడో తెలియడం లేదు. చేతిలో చిల్లగవ్వలేదు. వంట సరుకుల తెచ్చుకుందామన్నా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలి.
జావీద్, డ్రైవర్, మహారాష్ట్ర
Comments
Please login to add a commentAdd a comment