జగదేవ్‌పూర్: ప్రమాదవశాత్తూ లారీ దగ్ధమైన సంఘటన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం గొల్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. తాటిచెట్టు కొమ్మలు, కర్రల లోడుతో ఉన్న ఓ లారీని స్టార్ట్ చేయగానే సైలెన్సర్ నుంచి నిప్పు రవ్వలు వెలువడ్డాయి. లారీ కింద మొక్కజొన్న పొట్టు ఉంది. నిప్పు రవ్వలు మొక్కజొన్న పొట్టుకు తగిలి లారీలో ఉన్న కట్టెలకు అంటుకుంది. కొద్దిక్షణాల్లోనే డీజిల్ ట్యాంకర్‌కు అంటుకుని పేలింది. ఈ ఘటనలో లారీ చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది.