
ప్రేమజంట ఆత్మహత్య
కరీంనగర్ (కోహెడ) : కరీంనగర్ జిల్లా కోహెడ మండలం ఎల్లమ్మ ఆలయ సమీపంలోని బావిలో దూకి ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
మృతులు కోహెడ పట్టణానికి చెందిన కోడముంజ శిరీష(20), జెర్రిపోతుల నవీన్(22)లుగా గుర్తించారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.