సాక్షి, హైదరాబాద్ : ఎన్ని ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా విశ్వనగరం హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎదురులేదని మరోమారు రుజువైంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలోనూ రాష్ట్ర రాజధాని త్వరగానే కోలుకుందని, మళ్లీ హైదరాబాద్ కేంద్రంగా రియల్ కార్యకలాపాల్లో కదలిక మొదలైందని దేశీయ ప్రాపర్టీస్ సంస్థ ’మ్యాజిక్ బ్రిక్స్’ వెల్లడిం చింది. 2020 ఏప్రిల్– జూన్ నెలల మధ్య హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చిన మార్పులు, ముఖ్యంగా నిర్మాణ రంగంపై కరోనా ప్రభావం, వర్తమాన పరిస్థితి, భవి ష్యత్తులో ఎలా ఉంటుందనే దానిపై నివేదికను తన వెబ్ సైట్‌లో ఉంచింది. దీని ప్రకారం గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో నిర్మాణ రియల్ ఎస్టేట్ ధరలు 50%పెరగ్గా, కరోనా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న గత మూడు నెలల్లో 5.2% తగ్గాయి. ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో కనిపిస్తున్న మెరుగుదల, రాష్ట్ర ప్రభుత్వం కనబరుస్తున్న సానుకూల దృక్పథం, బిల్డర్లు కల్పి స్తోన్న వెసులుబాట్లు.. వెరసి 2020–21 ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం ప్రారం భంలోనే హైదరాబాద్ రియల్ రంగం మళ్లీ పట్టాలెక్కిందని ఆ నివేదిక తెలిపింది.
మ్యాజిక్ బ్రిక్స్ నివేదికలోని అంశాలివీ..
►హైదరాబాద్‌లో నిర్మాణ దశలో ఉన్న గృహాల విలువలు యథాతథం. వీటి ధరల తగ్గింపునకు బిల్డర్లు నిరాకరిస్తున్నారు.
► వాయవ్య హైదరాబాద్‌లో నిర్మాణ ధరలు తగ్గాయి. ఇందులో బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ ప్రాంతాలున్నాయి.
► నార్సింగి, బీరంగూడ, నిజాంపేట లాంటి ఉపాధి హబ్‌లలో ధరలు పుంజుకున్నాయి.
► ఈ ఏడాది ద్వితీయార్ధంలో గృహాల కొనుగోళ్లలో కదలిక కనిపిస్తోంది. కొను గోలుకు ఆసక్తి చూపుతున్న వారిలో 50% కన్నా ఎక్కువ మంది డబుల్ బెడ్ రూం
ఇళ్ల కోసం వెతుకుతున్నారు.
► చదరపు అడుగు రూ.5వేల కన్నా తక్కువ ధర ఉన్న ప్రాంతాల్లో కదలికలు వేగంగా ఉన్నాయి. రూ.6వేల కన్నా ఎక్కువ ధర ఉన్న ప్రాంతాల్లో ఇళ్ల కోసం వెతుకుతోంది 20 శాతం మంది
► ‘తూర్పు హైదరాబాద్’పై రియల్ ఆశలు భారీగా ఉన్నాయి. ప్రభుత్వ ‘లుక్ ఈస్ట్’ పాలసీతో ఈశాన్య దిశలో ఉన్న ఉప్పల్, పోచారం, ఘట్‌కేసర్‌తో పాటు మరోపక్క సాగర్ హైవే ప్రాంతంలోనూ మంచి భవిష్యత్ కనిపిస్తోంది.
► స్టాంప్ డ్యూటీ పెంచకపోవడం, స్వీయ నిర్ధారణ ద్వారా భవన నిర్మాణ అనుమ తులు మంజూరులాంటి విధానాలతో పాటు రానున్న ఐదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం, గృహ ప్రవేశం తర్వాతే ఈఎంఐలు కట్టేలా బిల్డర్లు వెసులుబాటు కల్పించడంలాంటి అంశాలు రియల్ రంగం కుదేలు కాకుండా దోహదపడుతున్నాయి.
► మూసీ రివర్ ఎక్స్‌ప్రెస్‌వే, మెట్రో ఫేజ్–2, పంజగుట్ట సమీపంలో బ్రిడ్జి, హైటెక్ సిటీ దగ్గర ఆర్‌వోబీ నిర్మాణం, నగరంలోని 52 పెద్ద జంక్షన్లను సిగ్నల్ ఫ్రీ జోన్లుగా మార్చడంలాంటి కార్యక్రమాలు నగర జీవనాన్ని సులభతరం చేయనున్నాయి.
కరోనా నుంచి కోలుకుని గృహ నిర్మాణ ధరలు ఇప్పటికే పెరిగిన ప్రాంతాలు
ప్రాంతం సగటు ధర (చ.అ. రూ.లలో) పెరిగిన శాతం
బీరంగూడ 3,241 1.7
ఆర్‌సీపురం 3,242 1.6
నిజాంపేట 3,941 4.2
టోలిచౌకి 4,009 3.5
ఉప్పల్ 4,133 2.9
పుప్పాలగూడ 4,773 3.9
మదీనగూడ 5,421 1.2
కోకాపేట 5,751 0.2
బేగంపేట 5,829 0.4
నార్సింగి 6,015 1.5
కొండాపూర్ 6,501 2.3
షేక్ పేట్ 6,999 0.6
Comments
Please login to add a commentAdd a comment