హైదరాబాద్: మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్న కొంతమంది ముఠా సభ్యులను శనివారం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దూరవిద్య ద్వారా నాగార్జున యూనివర్శిటీ నిర్వహిస్తున్న పరీక్షల్లో కొంతమంది మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు.
ఈ ఘటనకు సంబంధించి పలు కళాశాలల యజమానులు, ప్రిన్సిపాల్, కో ఆర్డినేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్న వారిలో అధికశాతం మంది పదోన్నతి కోసం వేరొకరితో పరీక్ష రాయిస్తున్నట్లు తెలుస్తోంది.