యైటింక్లయిన్ కాలనీ: కరీంనగర్ జిల్లా యైటింక్లయిన్ కాలనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.26 లక్షలు వసూలు చేసిన కనుకుల మనోజ అలియాస్ మనోజ్ తివారీ(22)ను గోదావరిఖని టూటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కమాన్‌పూర్ మండలం చిందెల్ల గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు గాజుల కనకశేఖర్, స్రవంతిలకు సాఫ్ట్‌వేర్, స్కూలు టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మనోజ నమ్మబలికింది.
నిజమేనని నమ్మిర వారు మనోజకు రూ.26 లక్షలు అందజేశారు. ఎన్నిరోజులైనా వాగ్దానం మేరకు ఉద్యోగాలు ఇప్పించలేకపోవటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు శుక్రవారం మనోజను అదుపులోకి తీసుకున్నారు. ఇదే ముఠాలో సభ్యులైన హైదరాబాద్‌కు చెందిన మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.