మునిసిపల్ అసిస్టెంట్ కమిషనర్ పై దాడి | man attacks on municipal assistant commissioner in adilabad | Sakshi
Sakshi News home page

మునిసిపల్ అసిస్టెంట్ కమిషనర్ పై దాడి

Published Sat, Feb 20 2016 8:14 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

man attacks on municipal assistant commissioner in adilabad

ఆదిలాబాద్: పన్ను వసూలుకు వెళ్లిన ప్రభుత్వాధికారిపై ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది.  పట్టణంలోని రిక్షా కాలనీలో నివాసం ఉండే రిటైర్డ్ కానిస్టేబుల్ బరిదాస్‌సింగ్ రాథోడ్.. మునిసిపాలిటీకి రూ.8వేల బకాయి పడ్డాడు. దీంతో రెడ్ నోటీసు జారీ అయింది.

ఈ కమ్రంలో పన్ను వసూలు కోసం అసిస్టెంట్ కమిషనర్ రవిబాబు, సీనియర్ అసిస్టెంట్ యాదవకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ శుక్రవారం రిక్షా కాలనీలోని రాథోడ్ ఇంటికి వెళ్లాడు. తన దగ్గర కట్టడానికి ప్రస్తుతం డబ్బులు లేవని రాథోడ్ చెప్పగా... వస్తువులు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అతడు దాడికి పాల్పడ్డాడు. అసిస్టెంట్ కమిషనర్ రవిబాబును కొట్టినట్టు సమాచారం. దీనిపై రవిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement