మండుతున్న ఎండలకు ప్రజల ప్రాణాలు బలవుతున్నాయి.
రంగారెడ్డి : మండుతున్న ఎండలకు ప్రజల ప్రాణాలు బలవుతున్నాయి. తాజాగా వడదెబ్బతో వ్యక్తి మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చీర్యాల గ్రామానికి చెందిన ఆంజనేయులు(49) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఎండలో పనిచేయాల్సిరావడంతో గురువారం మధ్యాహ్నం వడదెబ్బ బారిన పడ్డాడు. గమనించినవారు వెంటనే ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.