మెదక్ జిల్లాలో బుధవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది.
నారాయణఖేడ్: మెదక్ జిల్లాలో బుధవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ క్రాస్‌రోడ్డులో ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.
జూకల్ గిరిజన తండాకు చెందిన బానోత్ కిషన్(52) సైకిల్‌పై వెళ్తుండగా నిజాంపేట్ వైపు నుండి నారాయణఖేడ్ వైపునకు అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ అతనిని ఢీకొట్టింది. దీంతో బానోత్ కిషన్ తీవ్ర గాయాలపాలై మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.