ఓయూ జోలికి వస్తే.. ఖబడ్దార్: మందకృష్ణ | manda krishna fires cm kcr | Sakshi
Sakshi News home page

ఓయూ జోలికి వస్తే.. ఖబడ్దార్: మందకృష్ణ

Published Wed, May 27 2015 3:48 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

manda krishna fires cm kcr

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. బుధవారం ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పేదలకు భూములు ఇవ్వాలనుకుంటే హైదరాబాద్‌లో కబ్జా అయిన భూములు స్వాధీనం చేసుకుని వాటిలో ఇల్లు కట్టివ్వండి.  లేదంటే కాసుబ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కులో 200 ఎకరాలు కేటాయించండి. లేదా హుస్సేన్ సాగర్ చుట్టూ కబ్జా అయిన భూములు స్వాధీనం చేసుకుని ఇవ్వండి. అంతేగాని ఓయూ భూముల జోలికి వస్తే ఊరుకోబోమని.. ఖబడ్దార్ అంటూ మందకృష్ణహెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement