కొల్లాపూర్ మామిడికి కోటి కష్టాలు | Mango problems at kollapur | Sakshi
Sakshi News home page

కొల్లాపూర్ మామిడికి కోటి కష్టాలు

Published Sun, Apr 26 2015 4:41 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM

కొల్లాపూర్ మామిడికి కోటి కష్టాలు - Sakshi

కొల్లాపూర్ మామిడికి కోటి కష్టాలు

కొల్లాపూర్... ఈ పేరు మామిడి పండ్ల ప్రియులందరికీ సుపరిచితం. నూజివీడు, బంగినపల్లి తర్వాత మామిడి పండ్లకు అత్యంత     ప్రాచుర్యం ఉన్న ప్రాంతం కొల్లాపూర్. ఇక్కడ పండించే పండ్లను విదేశాల్లో ఉండే వారు సైతం ఇష్టంగా తెప్పించుకుని తింటుంటారు. సురభి రాజవంశ పాలనలో కొల్లాపూర్ మామిడి పండ్లను బ్రిటన్ రాజవంశీయులకు పంపించే వారు. ఇంతటి ప్రాచుర్యం ఉన్న కొల్లాపూర్‌లో ఈసారి మామిడి పంట దిగుబడి భారీగా పడిపోయింది.

గతేడాది పండించిన పంటలో ఈ సంవత్సరం 25శాతం మాత్రమే పండింది. అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్ల వానలు రైతులను నష్టాల బారిన పడేశాయి. గత సంవత్సరం పంట దిగుబడి భారీగా ఉన్నా ధరలు లేక మామిడి రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం ధరలు ఉన్నా పంటలు అంత దిగుబడి లేక నష్టపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ మాయాజాలం రెండూ మామిడి రైతులను నష్టాలు, కష్టాలపాల్జేస్తున్నాయి.     
 
 
కొల్లాపూర్: కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆ రువేలకు పైగా హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, వీపనగం డ్ల మండలంలో మామిడి సాగు అధికంగా జరుగుతోంది. మామిడి పంటలకు ప్రతి సం వత్సరం డిసెంబర్, జనవరి నెలలో పూతలు వస్తుంటాయి. ఈసారి మాత్రం ఫిబ్రవరిలో పూత ప్రారంభమైంది. కొన్నిచోట్ల మార్చిలో కూడా పూత వచ్చింది. ఫిబ్రవరిలో భారీ వరా లు, ఈదురు గాలుల కారణంగా పెద్ద మొత్తం లో పూత రాలిపోయింది. మళ్లీ మార్చి నెలాఖ రులో భారీ ఈదురుగాలులు, వడగండ్ల వాన లు కురవటంతో పిందె, కాయ దశలో కూడా మామిడి పంట భారీగా నేలరాలింది. వడగం డ్లు పడడంతో కాయలకు దెబ్బతగిలి పాడయ్యాయి. కాయ సైజు పెరగకముందే గత్యం తరం లేని పరిస్థితుల్లో రైతులు వాటిని తెంచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు.

మార్కెట్ మాయాజాలం

గతేడాది హైదరాబాద్‌లోని హోల్‌సెల్ మార్కెట్‌లో కొల్లాపూర్ మామిడికి వ్యాపారులు ట న్నుకు *15వేల నుంచి రూ.30వేల వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. పంటలు బాగా పండినా రైతులకు ఆశించిన స్థాయిలో లాభా లు రాలేదు. అయితే ఈ సారి పంటల దిగుబడి తగ్గిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ మార్కెట్‌లో వ్యాపారులు గత మార్చి లో టన్ను మామిడి కాయలను రూ.70వేల నుంచి రూ.90 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. పంటల దిగుబడి లేకున్నా మార్కెట్లో భారీ ధరలు ఉండడంతో రైతులు తోటల్లోనే కాయలను పెద్దమొత్తంలో తెంచేసి విక్రయాల కు తీసుకెళ్లారు. దీన్ని గమనించిన వ్యాపారు లు ఏప్రిల్‌లో టన్ను ధరను ఏకంగా *25వేల నుంచి రూ.30వేలకు పెంచేశారు. దీంతో మామిడి రైతులు లబోదిబోమంటున్నారు.

విదేశాలకు ఎగుమతులు..

కొల్లాపూర్ మామిడికి విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. హైదరాబాద్‌లో వ్యాపారస్తులు కొనుగోలు చేసే మామిడి కాయలను దేశంలోని ప్రధాన నగరాలతోపాటు విదేశాలకు ఎగుమతులు చేసి లాభాలు ఆర్జిస్తుంటారు. ఎగుమతుల వ్యాపారం మామిడి రైతులకు తెలియకపోవడంతో వారు పంట విక్రయాలకు దళారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

పంటనష్ట పరిహారం మంజూరుకు నిబంధనల అడ్డంకి

ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందేలా కనిపిం చ డం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పం ట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలంటే వింత నిబంధనలు అడ్డు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం పరిహారం మంజూరు కావాలంటే ఈదురు గాలులు, వర్షాల కారణంగా మామిడిచెట్లు వేర్లతో సహా విరిగి పడా లి. లేదంటే చెట్ల కొమ్మలు పూర్తిస్థాయిలో వి రిగిపోవాలి. లేదా వర్షాభావ పరిస్థితుల కారణంగా 50శాతం చెట్లు ఎండిపోవాలి. ఇలా ఉ ంటేనే ప్రభుత్వం పరిహారం మంజూరు చే స్తుంది. ఈ వింత నిబంధనలతో పరిహారంపై రైతులు ఆశలు వదిలిపెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement