అత్తాపూర్ : వివాహిత రాధిక కిడ్నాప్ కేసు దర్యాప్తును రాజేంద్రనగర్ పోలీసులు వేగవంతం చేశారు. ఈనెల 6న అదృశ్యమైన రాధికను రూ.3 లక్షలు ఇవ్వకపోతే ముంబైలో అమ్మేస్తానని దుండుగుడు చేసిన వాట్సాప్ కాలింగ్ ఆధారంగా ఏ ప్రాంతంలో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దుండగుడు బాధితురాలి భర్తకు ఫోన్ చేసి ఏమి మాట్లాడాడనే విషయాలు తెలుసుకున్నారు. అలాగే ఈనెల 6న గుడికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన రాధికను దుండగుడు ఎక్కడ కిడ్నాప్ చేసి ఉంటాడనే విషయాలు తెలుసుకునేందుకు ఆ మార్గాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.
అలాగే రాధిక ఫోన్ నంబర్, దుండగుడి ఫోన్ నంబర్ కాలింగ్ డేటాను కూడా సేకరించే పనిలో పడ్డారు. దుండగుడు బాధితురాలి భర్తకు డబ్బు డిపాజిట్ చేయమని ఇచ్చిన బ్యాంక్ ఖాతా ఆధారంగా అతను భవానీనగర్‌కు చెందిన మహమ్మద్ అజర్‌ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. అయితే, ఆ చిరునామాకు వెళ్లి విచారించగా ఆ పేరుతో ఎవరూ లేరని తెలిసింది. కాగా, రాధికను నిర్బంధించిన దుండగుడు ఆమె శరీరం నుంచి రక్తం కారుతున్న చిత్రాన్ని వాట్సాప్‌లో పంపడం కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో పలు అనువూనాలు వ్యక్తవువుతున్నారుు. భిన్న కథనాలు వినిపిస్తున్నారుు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత కిడ్నాప్ కేసు దర్యాప్తు ముమ్మరం
Published Sat, Jul 11 2015 11:53 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement