
మెట్రోపై పూర్తి హక్కులు తెలంగాణవే
హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపై పూర్తి హక్కులు తెలంగాణవేనని దీనిపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం ‘గ్రీన్ బకెట్ చాలెంజ్’ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ.1,450 కోట్లతో మెట్రో ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. కాలుష్యంతో పట్టణ ప్రజల జీవన కాలం తగ్గిపోతోందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం దేశ సేవగా భావించాలన్నారు.