వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారు: హరీష్‌ | Minister Harish Rao said More double bedrooms constructed in district | Sakshi
Sakshi News home page

వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారు: హరీష్‌

Published Tue, Jul 11 2017 3:22 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారు: హరీష్‌ - Sakshi

వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారు: హరీష్‌

మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలోనే అధికంగా డబుల్ బెడ్ రూంలను జిల్లాలో నిర్మిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. అంతేకాక రూ. 2.70 కోట్లతో ఆధునికి హంగులతో రైతు బజార్ నిర్మాణానికి స్వీకారం చుట్టామన్నారు. ఆయన  మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే అతిపెద్ద మోడరన్ రైతు జబర్ ను మంత్రి లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్యే వి. శ్రీనివాస్ గౌడ్, ఎంపీ జితేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డితో కలిసి ప్రారంభించారు.

జిల్లాకు మరిన్ని నిధులు అందేలా చేస్తామని మంత్రి అన్నారు. పాలమూరు నేలపై  కృష్ణానీటిని పరవళ్లు తొక్కించిన ఘనత టీఆర్ఎస్ దే అని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారని మంత్రి చెప్పారు. ఆ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మిని ట్యాంక్ బండ్ కు అవసరమైతే మరికొని నిధులు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement