సాక్షి, సిద్ధిపేట: రాష్ట్రంలో సిద్ధిపేట అన్ని రంగాల్లో ముందంజలో ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు, అధికారుల కృషితో ప్రతి గ్రామాన్ని గాంధీజీ కలలు కన్న గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. 30 రోజుల ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బాగా పనిచేశారని అభినందించారు. పారిశుద్ధ్య కార్మికులకు 15 రోజుల్లో ప్రమాద బీమా చేయించాలని చెప్పారు. ప్రతి గ్రామంలో శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. ప్రభుత్వ నర్సరీల్లో ప్రజలకు అవసరమైన మొక్కలను పెంచాలని సూచించారు. వివిధ పర్యటనల్లో భాగంగా గ్రామాల్లోని నర్సరీలను సందర్శిస్తామని పేర్కొన్నారు. చెత్త సేకరణ కోసం జనాభా ప్రతిపాదికన గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నామని హరీష్‌రావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment