నేనున్నా.. అధైర్యపడొద్దు..! | Minister Harish Rao visit in Crop farmers affected | Sakshi
Sakshi News home page

నేనున్నా.. అధైర్యపడొద్దు..!

Published Fri, Apr 7 2017 1:58 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

నేనున్నా.. అధైర్యపడొద్దు..! - Sakshi

నేనున్నా.. అధైర్యపడొద్దు..!

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: హరీశ్‌రావు
అకాల వర్షంతో దెబ్బతిన్న పంటల పరిశీలన
నివేదిక వెంటనే పంపాలని కలెక్టర్లకు ఆదేశం
త్వరలో ఢిల్లీ వెళ్లి సహాయం కోరతామని వెల్లడి


హుస్నాబాద్‌/ సిద్దిపేట జోన్‌:  పంట నష్టపో యిన రైతులు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌ రా వు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కొమురవెల్లి, నంగునూరు మం డలాల్లో దెబ్బతిన్న పంటలను గురువారం ఆయన పరిశీలించారు.  

మంత్రి మాట్లాడు తూ అకాల వర్షం, వడగండ్లు, ఈదురు గాలు లతో వరి, మామిడి, మక్కతో పాటు, కూరగా యల తోటలకు భారీ నష్టం వాటిల్లింద న్నారు. పంట చేతికి వచ్చే సమయంలో నోటి కాడి బుక్క పోయిందని రైతులు బాధపడు తున్నారని అన్నారు. ‘‘ మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు.. మీ వెంట నేనున్నా.. అన్ని విధా లుగా ఆదుకుంటా’’ అని రైతులకు హరీశ్‌ భరోసా ఇచ్చారు.

 గ్రామాలవారీగా క్షేత్రస్థాయి లో సర్వే చేసి వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా వ్యవ సాయ, రెవెన్యూ, ఉద్యానశాఖల అధికా రులను ఆదేశించామని తెలిపారు. అన్ని జిల్లా ల్లో పంటనష్టం వివరాలపై వెంటనే కలెక్టర్ల ద్వారా సమగ్ర నివేదిక తెప్పించి కేంద్రానికి పంపిస్తామన్నారు. ప్రతిపాదనల్లో కౌలు రైతుల పేర్లు కూడా నమోదు చేయాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

త్వరలో ఢిల్లీకి..
త్వరలోనే వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తాను ఢిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవ సాయశాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ను కలుస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. జరిగిన పంట నష్టాన్ని వివరించి, సహాయం కోరుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలసి రైతులను ఆదుకుంటాయని స్పష్టం చేశారు. పంట రుణాల నుంచి బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు బీమా కంపెనీల ద్వారా పరిహారం రావాలన్నారు. నిజానికి రైతులు వర్షాకాలం కంటే ఎక్కువగా నాట్లు వేశారని, కరెంట్‌ చాలా బాగా వచ్చిందని, చెరువుల్లో నీళ్లు ఉన్నాయని ఎంతో ఆశతో రైతులు ఆనందంగా ఉన్నారని, ఇంతలోనే అకాల వర్షాలు రైతుల ఆశలు అడియాశలు చేశాయని చెప్పారు.

విద్యుత్‌ ఫుల్‌.. నీరు నిల్‌.
ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా భేషుగ్గా ఉందని, సమస్య నీటితోనే ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అన్నదాతల వ్యథ ను తీర్చేందుకే కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను తరలించి రైతన్న బీడు భూములను సస్యశ్యామలం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డిలకు ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరును అందిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రాజెక్ట్‌లను అడ్డుకునేందుకు భూసేకరణకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించడం బాధకరంగా ఉందన్నారు.

డిసెంబర్‌ నాటికి ‘భగీరథ’
మిషన్‌ భగీర«థ పనులు డిసెంబర్‌ నాటికి తెలంగాణలోని సగం జిల్లాల్లో పూర్తి కానున్నాయని మంత్రి తెలిపారు. వచ్చే జూన్‌ నాటికి ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తానని అన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చేప డుతున్న చెరువుల పునరుద్ధరణ పనులను వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు, మంత్రులు సంద ర్శించి కితాబివ్వడం సంతోషదాయకమ న్నారు. మహిళా సంఘాల కోసం ఈ బడ్జెట్‌లో వడ్డీలేని రుణం కింద ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లను కేటాయించింద న్నారు. మహిళ గ్రూపులకు రూ.10 లక్షల రుణాన్ని అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement