
విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన చెందవద్దు
హైదరాబాద్ : ఎంసెట్-2 పేపర్ లీకైందని సీఐడీ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసి, ఎంసెట్-3 నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున గురువారం సచివాలయానికి చేరుకున్నారు. తిరిగి పరీక్ష నిర్వహించవద్దని వారు విజ్ఞప్తి చేశారు. సచివాలయం ఎదురు ధర్నాకు సిద్ధమయ్యారు.
మరోవైపు ఉప ముఖ్యమత్రి కడియం శ్రీహరి గురువారం వరంగల్లో మాట్లాడుతూ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై సీఐడీ నివేదిక పూర్తిస్థాయిలో వచ్చాకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కడియం శ్రీహరి సూచించారు.